- Telugu News Photo Gallery Golden fish caught in fishermen's net at udupi how did the atlantic fish come here
Viral: చేపల కోసం వల వేసిన జాలరి.. బయటకు తీయగా అదిరిపోయే సీన్..
చేపల వేటకు వెళ్లిన మత్య్సకారులకు వింత.. వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. ఒకసారి.. కొండ చిలువలు, మరికొన్ని మొసళ్లు ఇలా ఏవేవో జంతువులతో పాటు వస్తువులు కూడా వలలో చిక్కుకున్న సందర్భాలున్నాయి.
Updated on: Jan 26, 2023 | 1:14 PM

చేపల వేటకు వెళ్లిన మత్య్సకారులకు వింత.. వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. ఒకసారి.. కొండ చిలువలు, మరికొన్ని మొసళ్లు ఇలా ఏవేవో జంతువులతో పాటు వస్తువులు కూడా వలలో చిక్కుకున్న సందర్భాలున్నాయి. అయితే, తాజాగా.. ఓ జాలరికి అనుకోకుండా అదృష్టం దరిచేరింది. అరుదైన చేప వలకు చిక్కడంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఉడిపిలోని మల్పే బీచ్‌లో అరుదైన బంగారు రంగు చేప మత్స్యకారుల వలలో పడింది. అంజాల్ చేప బంగారు రంగులో ఉంటుంది. ఇది సుమారు 16 కిలోల బరువు ఉంది. బోటులో చేపల వేటకు వెళ్లిన సందర్భంలో ఈ చేప వలలో చిక్కుకున్నట్లు జాలరీ తెలిపాడు.

మల్పే ఓడరేవులో బంగారు రంగు అంజల్ చేప కిలోకు 600 రూపాయలుగా విక్రయించారు. అయితే.. బంగారు చేప దొరికిందన్న సమాచారం అందుకున్న స్థానికులు చేపను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారు. దీంతోపాటు ఆ చేపను దక్కించుకునేందుకు పోటీ కూడా పడ్డారు.

అట్లాంటిక్ సరస్సులలో ఒక ప్రత్యేక ఏంజెల్ ఫిష్ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ, ఇప్పుడు కర్నాటక మత్స్యకారుల వలలో ఈ ప్రత్యేక చేప పడటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

చివరకు.. మల్పేకు చెందిన సురేష్ ఈ చేపను మొత్తం రూ.9,600కు కొనుగోలు చేశాడు. ఒక్క చేప అమ్మగా రూ.పదివేలు వచ్చినట్లు మత్స్యకారులు తెలిపారు.

అరేబియా సముద్రానికి చెందిన అంజల్ చేపలకు సహజసిద్ధమైన లక్షణాలు లేదా జన్యుపరంగా బంగారు రంగు వచ్చే అవకాశం ఉందని పరిశోధకురాలు డా.తజ్జా తెలిపారు.

కాగా.. ఈ చేప వలకు చిక్కడం, దాన్ని కొనేందుకు పోటీపడటంతో మార్కెట్లో సందడి నెలకొందని జాలర్లు వెల్లడించారు.





























