AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

28 ఏళ్ల కోడలితో 70 ఏళ్ల మామ పెళ్లి.. ‘ఇదేందయ్యా పెద్దమనిషి..? కోడలి పిల్ల గొంతుకోశావ్‌..’

70 ఏళ్ల వయసున్న ఓ మామ తన కొడుకు మృతి చెందడంతో ఒంటరైన 28 ఏళ్ల కోడలిని వివాహం చేసుకున్నాడు. ఈ విచిత్ర ఘటన ఎక్కడ చోటుచేసుకుందంటే..

28 ఏళ్ల కోడలితో 70 ఏళ్ల మామ పెళ్లి.. 'ఇదేందయ్యా పెద్దమనిషి..? కోడలి పిల్ల గొంతుకోశావ్‌..'
Uttar Pradesh News
Srilakshmi C
|

Updated on: Jan 26, 2023 | 7:13 PM

Share

70 ఏళ్ల వయసున్న ఓ మామ తన కొడుకు మృతి చెందడంతో ఒంటరైన 28 ఏళ్ల కోడలిని వివాహం చేసుకున్నాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లోని ఛపియా ఉమ్రావ్ గ్రామానికి చెందని కైలాష్ యాదవ్ (70) అనే వ్యక్తికి నలుగురు కుమారులు ఉన్నారు. పన్నెండేళ్ల క్రితం భార్య మృతి చెందింది. కైలాష్ ఒంటరిగానే జీవిస్తున్నాడు. అనంతరం కొడుకులు పెళ్లిళ్లు చేసుకుని వేర్వేరుగా కాపురం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మూడో కుమారుడు ఇటీవల చనిపోవడంతో కోడలు పూజ ఒంటరిదైంది. దీంతో మామ కైలాష్ తన కోడలైన పూజను సమీపంలోని ఓ గుడికి తీసుకెళ్లి నుదుటిన సింధూరం దిద్ది పూల దండ వేసి వివాహం చేసుకున్నాడు. పూజ కూడా మామ మెడలో పూల మాల వేసి తన సమ్మతిని తెలిపింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటో నెట్టింట వైరల్ కావడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కోడలిపై అంత ప్రేమ ఉంటే ఆమె వయసుకు తగ్గట్టు ఇంకో వరుడిని చూసి పెళ్లి చేయాలి కానీ వృద్ధుడైన మామకు ఆ వయసులో పెళ్లి అవసరమా అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లిద్దరూ మేజర్లు నిర్ణయం తీసుకునే హక్కు వారికి ఉందంటూ మరికొందరు వీరి వివాహాన్ని సమర్ధిస్తున్నారు. ఐతే స్వగ్రామస్తులు ఇందేందయ్యా పెద్దమనిషి అని ప్రశ్నిస్తే కైలాష్ యాదవ్ నోరుమెదపకుండా మౌనంగా ఉండటం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.