NIVEDI Recruitment 2023: నెలకు రూ.70,000ల జీతంతో బెంగళూరులోని ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో కొలువులు.. ఎలా ఎంపిక చేస్తారంటే..

బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వెటర్నరీ ఎపిడమాలజీ అండ్‌ డిసీజ్‌ ఇన్ఫర్మేషన్‌ (ఎన్‌ఐవీఈడీఐ).. 12 సీనియర్‌ రిసెర్చ్‌ఫెలో, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన..

NIVEDI Recruitment 2023: నెలకు రూ.70,000ల జీతంతో బెంగళూరులోని ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో కొలువులు.. ఎలా ఎంపిక చేస్తారంటే..
ICAR-NIVEDI
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 26, 2023 | 8:42 PM

బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వెటర్నరీ ఎపిడమాలజీ అండ్‌ డిసీజ్‌ ఇన్ఫర్మేషన్‌ (ఎన్‌ఐవీఈడీఐ).. 12 సీనియర్‌ రిసెర్చ్‌ఫెలో, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌/బ్యాచిలర్స్‌ డిగ్రీ/ఇంజినీరింగ్‌ డిగ్రీ/పీజీ/ఎంటెక్‌/మాస్టర్స్‌డిగ్రీ/ఎంబీఏ/ఎంఎస్సీ/ఎంఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల యవసు వయసు18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్న వారు ఫిబ్రవరి 13, 2023వ తేదీ సాయంత్రం 5 గంటల 30 నిముషాలలోపు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. స్క్రీనింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.15,000ల నుంచి రూ.70,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్..

ICAR-NIVEDI, Ramagondanahalli, Yelahanka, Bengaluru- 560064.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.