DMHO Chittoor Jobs 2023: పదో తరగతి అర్హతతో రాత పరీక్షలేకుండా చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన చిత్తూరులోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. ఒప్పంద/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 16 థియేటర్ అసిస్టెంట్, పోస్ట్‌మార్టం అసిస్టెంట్ పోస్టుల..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన చిత్తూరులోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. ఒప్పంద/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 16 థియేటర్ అసిస్టెంట్, పోస్ట్‌మార్టం అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఏదైనా ఆసుపత్రిలో కనీసం ఐదేళ్లపాటు నర్సింగ్ అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుల వయసు జులై 1, 2022 నాటికి 42 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు జనవరి 31, 2023వ తేదీ సాయంత్రం 5 గంటల 30 నిముషాలలోపు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌లో అప్లికేషన్లను సమర్పించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.250లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఫిజికల్ చాలెంజ్ అభ్యర్ధులు ఫీజు చెల్లించనవసరం లేదు. విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.15,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్..
The District Medical & Health Officer, Chittoor, AP.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.