AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ రెండు రూపాయల డాక్టర్‌ గురించి మీకు తప్పక చెప్పాలి.. ‘పద్మశ్రీ’కి ఎంపికైన నిస్వార్ధ ప్రతిభ..

ఆయన ఓ వైద్యుడు. సంపాదించడానికి వైద్యవృత్తిని చేపట్టే నేటి కాలపు వైద్యుల మాదిరికాదు. నిరుపేదలకు సేవ చేయాలనే సంకల్పంతో కేవలం 2 రూపాయలకే వైద్యం అందించిన దైవం. ఆయన సేవలను గుర్తించిన..

ఈ రెండు రూపాయల డాక్టర్‌ గురించి మీకు తప్పక చెప్పాలి.. 'పద్మశ్రీ'కి ఎంపికైన నిస్వార్ధ ప్రతిభ..
Dr Munishwar Chandar Dawar
Srilakshmi C
|

Updated on: Jan 26, 2023 | 9:57 PM

Share

ఆయన ఓ వైద్యుడు. సంపాదించడానికి వైద్యవృత్తిని చేపట్టే నేటి కాలపు వైద్యుల మాదిరికాదు. లక్షల్లో ఫీజులు తీసుకుని నామమాత్రం వైద్యం అందించే డాక్టర్ కానేకాదు. నామమాత్రం ఫీజు తీసుకుని రోగాన్ని నయం చేసే నికార్సౌన వైద్యుడు. నిరుపేదలకు సేవ చేయాలనే సంకల్పంతో కేవలం 2 రూపాయలకే వైద్యం అందించిన దైవం. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం దేశంలోనే నాలుగో అత్యున్నత పురస్కారంగా భావించే పద్మశ్రీతో సత్కరించనుంది.

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన డాక్టర్ మునీశ్వర్ చందర్ దావర్ (77) పాకిస్థాన్‌ పంజాబ్‌లో జనవరి 16, 1946న జన్మించారు. విభజన తర్వాత చందర్ దావర్ కుటుంబం భారత్‌కు వలస వచ్చారు. 1967లో జబల్పూర్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు.1971లో జరిగిన ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో భారత ఆర్మీలో దాదాపు ఏడాది పాటు పనిచేశారు. ఆ తర్వాత 1972 నుంచి జబల్‌పూర్‌లో స్వంత ప్రాక్టీస్‌ మొదలు పెట్టి.. కేవలం 2 రూపాయలకు చికిత్స చేయడం ప్రారంభించారు. ఈ విధంగా ప్రతిరోజూ దాదాపు 200 మందికిపైగా రోగులకు తన చేతులతో వైద్యం చేస్తారు. ప్రస్తుతం తన ఫీజుగా కేవలం రూ. 20కు మాత్రమే పెంచి చికిత్సనందిస్తున్నారు.

చిత్తశుద్ధితో పనిచేసే వారికి గుర్తింపు కొన్ని సార్లు ఆలస్యమైనా వారి కష్టానికి ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది. అందుకు నిదర్శనంగానే ఈ రోజునాకీ అవార్డు దక్కింది. విజయ రహస్యం సహనంతో పనిచేయడమే. అప్పుడు విజయంతోపాటు గౌరవం కూడా పొందుతారని డాక్టర్ మునీశ్వర్ చందర్ దావర్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.