AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hampi: స్తంభాల్లోనే కాదు.. రాళ్లలోనూ సంగీత ధ్వనులు.. హంపిలో అణువణువూ అద్భుతమే..

విజయనగర రాజుల పాలనలో రాజధానిలో ఓ వెలుగు వెలిగిన హంపిలో.. ఎక్కడ చూసినా అద్భుత దృశ్యాలే కనిపిస్తున్నాయి. హంపిలో స్తంభాలు సంగీతాన్ని చేయడం మనకు తెలిసిందే. అయితే అక్కడ స్తంభాలు మాత్రమే కాదు..

Hampi: స్తంభాల్లోనే కాదు.. రాళ్లలోనూ సంగీత ధ్వనులు.. హంపిలో అణువణువూ అద్భుతమే..
Hampi Musical Pillars
Ganesh Mudavath
|

Updated on: Jan 30, 2023 | 7:54 PM

Share

విజయనగర రాజుల పాలనలో రాజధానిలో ఓ వెలుగు వెలిగిన హంపిలో.. ఎక్కడ చూసినా అద్భుత దృశ్యాలే కనిపిస్తున్నాయి. హంపిలో స్తంభాలు సంగీతాన్ని చేయడం మనకు తెలిసిందే. అయితే అక్కడ స్తంభాలు మాత్రమే కాదు.. చదునైన రాళ్లు కూడా సంగీతాన్ని ప్లే చేస్తున్నాయి. హంపి.. విజయనగర సామ్రాజ్యానికి చెందిన గొప్ప నగరం. అక్కడి దేవాలయాలు, నిర్మాణాలు, శిల్పాలు, భవనాలు అద్భుతంగా ఉన్నాయి. చూడటానికి అనేక ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా.. ప్రపంచ వారసత్వ ప్రదేశం హంపిలోని విజయ విఠ్ఠల దేవాలయంలోని స్తంభాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఈ స్తంభాలను 15వ శతాబ్దంలో దేవరాయ II నిర్మించారు. విఠల దేవాలయంలోని 56 సప్తస్వర స్తంభాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఈ స్తంభాల నుంచి వెలువడే పంచవాద్య, జల తరంగ, ఘంటసాల, బడి గంట, కాలింగ్ బెల్, ఘట్వాద్య, డమరుగ, మృదంగ, వీణ నాదాలను వినేందుకు పర్యాటకులు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ.. వాటి రక్షణ కోసం భారత పురావస్తు శాఖ 2000 సంవత్సరంలో సంగీత మందిరంలోని స్తంభాలను తాకకూడదని నిషేధం విధించింది.

కానీ ఇప్పుడు కొన్ని వైరల్ వీడియోలు సంగీతాన్ని వింటున్న మరికొన్ని నిర్మాణాలను చూపుతున్నాయి. ఆలయంలోని రంగ మండపంలో ఉన్న 56 స్తంభాలు వివిధ తాళ వాయిద్యాల ధ్వనిని ఉత్పత్తి చేస్తున్నాయి. వైరల్ అవుతున్న వీడియోలో నాలుగు రాళ్లు ఉన్నాయి. వాటిపై ఓ వ్యక్తి చేతులతో కొట్టడాన్ని చూడవచ్చు. కొట్టిన ప్రతిసారీ సంగీత స్వరం ఉద్భవిస్తుంది. మ్యూజిక్ పోల్స్ లాగా వీటిని మ్యూజిక్ ప్యానెల్స్ అంటారు. వేళ్లతో కొట్టినప్పుడల్లా రాళ్లు శ్రావ్యమైన సౌండ్ ను ఇస్తున్నాయి. ఇది అష్టభుజి మండపంలోని ధాన్యాగారానికి సమీపంలో ఉంది.

ఇవి కూడా చదవండి

ఇప్పటికీ చాలా మంది ట్విటర్ వినియోగదారులు ఎరిక్ సోల్హీమ్ పోస్ట్‌పై స్పందించారు. ఇది నిజంగా గొప్పదని కామెంట్లు చేస్తున్నారు. గొప్ప శాస్త్రీయ, విద్యా చరిత్ర ఆశ్చర్యకరమైనదని, మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి కొత్త విషయాలను నేర్చుకోవడం చాలా అవసరం అని నెటిజన్లు తమ అభిప్రాయాలు రాస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.