AIASL Recruitment 2023: ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌స్పోర్ట్ సర్వీసెస్‌లో 166 ఉద్యోగాలు..రాత పరీక్షలేకుండా ఎంపిక..
కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏఎస్‌ఎల్).. ఒప్పంద ప్రాతిపదికన 166 హ్యాండీమ్యాన్, యుటిలిటీ ఏజెంట్ కంట్ ర్యాంప్ డ్రైవర్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఇతర పోస్టుల భర్తీకి..
కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏఎస్‌ఎల్).. ఒప్పంద ప్రాతిపదికన 166 హ్యాండీమ్యాన్, యుటిలిటీ ఏజెంట్ కంట్ ర్యాంప్ డ్రైవర్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఇతర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన వారు అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో విధులు నిర్వహించవల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంగ్లిష్, హిందీ భాషలపై అవగాహనతోపాటు హెచ్‌ఎమ్‌వీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. పోస్టును బట్టి అభ్యర్ధుల వయసు 28 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు 2023, ఫిబ్రవరి 7,8,9,10,11,12,13వ తేదీన కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.17,520ల నుంచి రూ.32,200ల వరకు జీతంగా చెల్లిస్తారుఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
- కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల సంఖ్య: 11
- జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల సంఖ్య: 25
- యుటిలిటీ ఏజెంట్ అండ్ ర్యాంప్ డ్రైవర్ పోస్టుల సంఖ్య: 7
- హ్యాండీవిమిన్ పోస్టుల సంఖ్య: 45
- హ్యాండీమ్యాన్ పోస్టుల సంఖ్య: 36
- హ్యాండీమ్యాన్ (క్లీనర్స్) పోస్టుల సంఖ్య: 20
- డ్యూటీ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 6
- జూనియర్ ఆఫీసర్ టెక్నీషియన్ పోస్టుల సంఖ్య: 4
- జూనియర్ ఆఫీసర్ ప్యాసెంజర్ పోస్టుల సంఖ్య: 12
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.