AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Groundwater Charges: సామాన్యులకు షాక్‌.. ఫిబ్రవరి 1 నుంచి భూమిలోని నీళ్లు చేదితే భారీ మొత్తంలో పన్ను విధింపు..

నీరు, గాలి, వెలుతురు వంటివి ప్రకృతి సహజ సిద్ధంగా మానవాళికి అందించిన సంపద. ఐతే వచ్చే నెల నుంచి భూమి నుంచి నీళ్లు ఏవరైనా తోడుకుంటే మాత్రం పన్ను చెల్లించుకోవల్సిందే. పరిశ్రమలతో సహా వివిధ వినియోగదారులు..

Groundwater Charges: సామాన్యులకు షాక్‌.. ఫిబ్రవరి 1 నుంచి భూమిలోని నీళ్లు చేదితే భారీ మొత్తంలో పన్ను విధింపు..
Groundwater Charges
Srilakshmi C
|

Updated on: Jan 30, 2023 | 3:15 PM

Share

నీరు, గాలి, వెలుతురు వంటివి ప్రకృతి సహజ సిద్ధంగా మానవాళికి అందించిన సంపద. ఐతే వచ్చే నెల నుంచి భూమి నుంచి నీళ్లు ఏవరైనా తోడుకుంటే మాత్రం పన్ను చెల్లించుకోవల్సిందే. పరిశ్రమలతో సహా వివిధ వినియోగదారులు భూగర్భ జలాలను వెలికితీస్తే పన్నుమోత మోగుతుంది. ఇదేదో విదేశాల్లో అనుకుంటే పొరపాటే. అక్షరాలా మన దేశంలోని పంజాబ్‌ రాష్ట్ర సీఎం భగవంత్‌ మాన్‌ ప్రభుత్వం ఇలాంటి పన్ను విధిస్తున్నట్లు ప్రజలకు షాక్‌ ఇచ్చారు. పంజాబ్‌ నీటి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రకారం ఇకపై భూగర్భ జాలలను ఎవరైనా వినియోగిస్తే పన్ను విధించనుంది. వ్యవసాయం, తాగునీళ్లు, గృహావసరాల కోసం భూగర్భ జలాల వినియోగాలకు మాత్రం పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే ప్రభుత్వ నీటి సరఫరా పథకాలు, సైనిక-కేంద్ర పారామిలటరీ సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీ రాజ్ సంస్థలు, కంటోన్మెంట్ బోర్డులు, డెవలప్‌మెంట్‌ ట్రస్టులు, ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీలు, ప్రార్థనా స్థలాలకు కూడా మినహాయింపు ఉంటుంది. అంటే నెలకు 300 క్యూబిక్ మీటర్ల కంటే తక్కువ భూగర్భ జలాలను వెలికితీసే వినియోగదారులకు మాత్రమే మినహాయింపు వర్తిస్తుందన్నమాట.

ఈ మేరకు పంజాబ్ వాటర్ రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PWRDA) ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఆదేశాల ప్రకారం బోరు బావులు, బావులు.. వంటి వాటి ద్వారా భూగర్భజలాలను వెలికితీతకు ముందుగా అధికారుల అనుమతి తీసుకోవాలి. తర్వాత ప్రభుత్వం నిర్ణయించిన జోన్లలో భూగర్భ జలాల వెలికితీత, క్యూబిక్‌ మీటర్ల పరిమాణాలను బట్టి ఛార్జీలు విధిస్తారు. ఈ ఆదేశాలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. తాజా నిర్ణయంపై పెద్ద ఎత్తున ప్రజాగ్రహం వ్యక్తం అవుతోన్నప్పటికీ భూగర్భ జలాలను కాపాడుకునేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది పంజాబ్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..