Viral Video: వామ్మో 70 కోట్ల రూపాయలా..? ఈ కంపెనీ ఉద్యోగులకు ఇచ్చిన బోనస్‌ చూస్తే దిమ్మ తిరిగిపోద్దంతే..!

ఈ కంపెనీ మాత్రం ఉద్యోగులకు కోట్లలో బోనస్‌ ఇచ్చింది. కంపెనీ వార్షికోవత్సవం నాడు యాజమన్యం ఇచ్చిన డబ్బుకట్టలను చేతులతో మోయలేక మోసుకుంటూ వెళ్తున్న ఉద్యోగులకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. మీరూ ఓలుక్కేసుకోండి..

Viral Video: వామ్మో 70 కోట్ల రూపాయలా..? ఈ కంపెనీ ఉద్యోగులకు ఇచ్చిన బోనస్‌ చూస్తే దిమ్మ తిరిగిపోద్దంతే..!
Mega Bonus
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 30, 2023 | 4:43 PM

సాధారణంగా ఏ కంపెనీ అయిన పండుగలు, పబ్బాలకు వందలో, వేలో బోనస్‌గా ఇచ్చి మమ.. అనిపించేస్తాయి. ఆ బోనస్‌లో మహా అయితే పదో, పదిహేనో నోట్లు ఉంటాయి. వీటిని జేబులో మడిచి పెట్టుకుంటే మూడో కంటికి తెలిసే అవకాశం కూడా ఉండదు. ఐతే ఈ కంపెనీ మాత్రం ఉద్యోగులకు కోట్లలో బోనస్‌ ఇచ్చింది. కంపెనీ వార్షికోవత్సవం నాడు యాజమన్యం ఇచ్చిన డబ్బుకట్టలను చేతులతో మోయలేక మోసుకుంటూ వెళ్తున్న ఉద్యోగులకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. మీరూ ఓలుక్కేసుకోండి..

చైనాలోని క్రేన్లను తయారు చేసే హెనాన్ మైన్ అనే కంపెనీ వార్షిక పార్టీలో దాదాపు రెండు మీటర్ల ఎత్తులో 61 మిలియన్ యువాన్ల (భారతీయ కరెన్సీలో రూ. 73,78,48,939)ను శిఖరంలా పేర్చింది. గత ఏడాది (2022) మందగమనంలోనూ కంపెనీ పనితీరు మెరుగ్గా ఉండటంతో బోనస్‌లు ఇచ్చిందట. అత్యుత్తమ పని తీరు కనబరచిన ముగ్గురు సేల్స్‌ మేనేజర్లను ఎంపిక చేసి బహుహతిగా దిమ్మ తిరిగే గిఫ్ట్‌ ఇచ్చింది సదరు కంపెనీ. ఒక్కొక్కరికి దాదాపు ఐదు మిలియన్ యువాన్ల (అంటే 6 కోట్ల 4 లక్షల 60 వేల138 రూపాయలు)ను బోనస్‌గా ఇచ్చి సత్కరించింది. ముప్పై మందికిపైగా ఇతర ఉద్యోగులకు ఒక్కొక్కరికి ఒక్కో మిలియన్ యువాన్ (అంటే 1 కోటి 20 లక్షల 91 వేల రూపాయలు)లను అందించింది. జనవరి 17న నిర్వహించిన సేల్స్ ఇయర్-ఎండ్ మీటింగ్‌లో 61 మిలియన్ యువాన్‌లను 40 సేల్స్ మేనేజర్‌లకు బోనస్‌గా ఇచ్చినట్లు మీడియాకు వెల్లడించింది. అంతేకాకుండా ఈ డబ్బును లెక్కించేందుకు పడ్డతంటాలు అన్నీఇన్నీ కావట. వంద యువాన్ల చొప్పున లెక్కించేందుకు పోటీ సైతం నిర్వహించారు. ప్రస్తుతం ఈ క్రేన్‌ తయారీ కంపెనీ పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

2002లో స్థాపించిన హెనాన్ మైన్ కంపెనీలో దాదాపు 5,100పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. 2022లో 9.16 బిలియన్ యువాన్ల (రూ. 1,10,75,56,08,359) ఆదాయాన్ని అర్జించింది. గత ఏడాదితో పోలిస్తే 23 శాతం అధిక లాభాలు గడించిందట. అంతేకాకుండా గత మూడేళ్లుగా కంపెనీలో ఏ ఉద్యోగిని తొలగించకపోవడం విశేషం.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.