మరో భారీ కుంభకోణానికి స్కెచ్.. ఈసారి ఐడీబీఐ బ్యాంక్‌ నుంచి రూ. 4,760 కోట్ల రుణాలు ఎగవేత

దేశంలో మరో భారీ కుంభకోణం వెలుగులోకొచ్చింది. ఈ సారి ఏకంగా 4,760 కోట్ల రూపాయలు బ్యాంకు రుణాల ఎగవేతకు భారీ స్కెచ్‌ వేశారు. వివిధ బ్యాంకుల నుంచి పలు దఫాలుగా జీటీఎల్ అనే కంపెనీ రుణాల సేకరించి, మూడో కంటికి తెలియకుండా దారి మల్లింపు..

మరో భారీ కుంభకోణానికి స్కెచ్.. ఈసారి ఐడీబీఐ బ్యాంక్‌ నుంచి రూ. 4,760 కోట్ల రుణాలు ఎగవేత
GTL Scam
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 27, 2023 | 8:17 PM

దేశంలో మరో భారీ కుంభకోణం వెలుగులోకొచ్చింది. ఈ సారి ఏకంగా 4,760 కోట్ల రూపాయలు బ్యాంకు రుణాల ఎగవేతకు భారీ స్కెచ్‌ వేశారు. వివిధ బ్యాంకుల నుంచి పలు దఫాలుగా జీటీఎల్ అనే కంపెనీ రుణాల సేకరించింది. జీటీఎల్ లిమిటెడ్ కంపెనీ గ్లోబల్ గ్రూపుకు చెందిన మనోజ్ తివారీ 1987లో ప్రారంభించారు. దేశ విదేశాల్లో టెలికాం ఆపరేటర్లకు నెట్‌వర్క్ విస్తరణ, నిర్వహణ సేవలు అందించే వ్యాపారాలు చేస్తోంది.

బ్యాంకుల నుంచి సేకరించిన రుణాలను జీటీఎల్ లిమిటెడ్ పలు కంపెనీలకు మళ్లించి.. ఆనక వాటిని కట్టలేమని చేతులెత్తేసింది. దీనిపై నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి నిరోదక చట్టంలోని పలు సెక్షన్ల కింద సీబీఐ టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేజర్ జీటీఎల్‌పై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ భారీ కుంభకోణంలో కొందరు బ్యాంకు ఉన్నతాధికారులు, డైరెక్టర్ల పాత్ర ఉందని.. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది. దాదాపు 24 మంది రుణదాతల కన్సార్టియం నుంచి జీటీఎల్ లిమిటెడ్ కంపెనీ లోన్ తీసుకుని మోసానికి పాల్పడిందని సీబీఐ తెల్పింది. ఐడీబీఐ లీడ్ బ్యాంకుగా ఉండి ఐసీఐసీఐ నుంచి రూ. 650 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 467 కోట్లు, కెనరా బ్యాంక్ నుంచి రూ. 412 కోట్ల మేర రుణాలు తీసుకొని మెటీరియల్స్, వస్తువుల సరఫరా పేరిట పక్కదారి పట్టించినట్లు ఆరోపించింది. 2009లోపట్టాలెక్కిన ఈ స్కాం పలు దఫాలుగా తీసుకున్న రుణాలను ఇతర కంపెనీల షేర్ల కొనుగోలుకు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల కోసం వినియోగించినట్టు తేలింది. 2011లో ఐడీబీఐ బ్యాంక్ కంపెనీపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించి, విక్రేతలతో అనుమానాస్పద లావాదేవీల సమస్యను లేవనెత్తింది.

ఐతే ఈ విషయంపై లీడ్ బ్యాంక్‌ ఐడీబీఐని రిజర్వ్ బ్యాంకును ఆర్బీఐ 2016, ఏప్రిల్‌ 1న హెచ్చరించినా తన తీరు మార్చుకోలేదు. రెడ్ ఫ్లాగ్ చేసి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించమని ఆర్బీఐ సూచిస్తే.. అలా చేస్తే బకాయిల వసూలు మరింత ఆలస్యం అవుతుందని ఐడీబీఐ జాప్యం చేస్తూ వచ్చింది. ఐతే అదే ఏడాది జులైలో తన ఆదేశాలు పాటించాల్సిందేనని స్పష్టం చేస్తూ చార్టర్డ్ అకౌంటెంట్‌ని ఆర్బీఐ నియమించింది. చివరికి నలుగురు విక్రేతలపై రూ. 1,213.97 కోట్ల బకాయిలు ఉన్నట్లు 2017లో హైడ్రామా చేశారు. నిజానికి ఆ నలుగురు విక్రేతలకు కంపెనీ సప్లయిస్‌, కంపెనీల గోడౌన్‌లు, మెటీరియల్ ఎక్కడ సరఫరా చేయబడుతున్నాయో, ఆలసు ఈ వెండర్ కంపెనీలు ఏ పనిని ఉపయోగిస్తాయో కూడా వారికి తెలియదనే విషయం సీబీఐ విచారణలో బయటపడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!