Hyundai Creta: రూ. 14 లక్షల హ్యుందాయ్ క్రెటా.. కేవలం రూ. 6.5 లక్షలకే.. ఈఎంఐ సౌకర్యం కూడా..
హ్యుందాయ్ క్రెటాను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా.? ఆ కారు ప్రస్తుత ఎక్స్ షోరూమ్ ధర రూ. 14 లక్షలు..
హ్యుందాయ్ క్రెటాను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా.? ఆ కారు ప్రస్తుత ఎక్స్ షోరూమ్ ధర రూ. 14 లక్షలు. అయితే నో టెన్షన్.! ఎందుకంటే మీరు ఇప్పుడు రూ. 6.5 లక్షలకే పొందొచ్చు. ఇంత తక్కువ ధరలో హ్యుందాయ్ క్రెటాను ఎలా కొనుగోలు చేయవచ్చునని ఆలోచిస్తున్నారా.? అదేనండీ.. సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలను చేసే ప్రముఖ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫార్మ్‌లో హ్యుందాయ్ కెట్రాను తక్కువ బడ్జెట్‌లోనే పొందొచ్చు. ఇది ‘కార్‌దేఖో'(Car Dekho) డాట్ కామ్‌లో అందుబాటులో ఉంది. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందామా.?
హ్యుందాయ్ క్రెటా 1.4 ఎస్ ప్లస్ వేరియంట్‌ను రూ. 6.50 లక్షలకు అమ్మకానికి ఉంచారు. 2015 మోడల్ అయిన ఈ కారు ఇప్పటి వరకు 50,723 కిలోమీటర్లు ప్రయాణించింది. న్యూఢిల్లీలో అందుబాటులో ఉన్న ఈ కారును EMIలో కూడా కొనుగోలు చేయవచ్చు. దీనిని ఫస్ట్ ఓనర్ సేల్‌లో పెట్టారు. కాగా, సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేసేటప్పుడు.. సదరు వాహన యజమానిని కలవకుండా, కారు పత్రాలను ధృవీకరించకుండా ఆర్ధిక లావాదేవీలు చేయొద్దు.