దారుణం.. చికిత్స కోసం వచ్చిన మహిళ రెండు కిడ్నీలు చోరీ..! సంబంధం లేదని వదిలేసిన భర్త..
ఆసుపత్రిలో సునీత తల్లి ఆమెను చూసుకుంటుంది. ఆసుపత్రి యాజమాన్యం కూడా సునీతకు సహాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇప్పటివరకు వచ్చిన దాతలలో ఎవరి కిడ్నీ ఆమెకు సరిపోలేదని తెలిసింది.
డాక్టర్‌ని కనిపించే దేవుడు అని భావిస్తారు ప్రజలు. చికిత్స కోసం వచ్చే ప్రజలు ఎంతో నమ్మకంతో తమ ప్రాణాలను వారి చేతుల్లో పెడతారు. అలాంటి వైద్యులు ఓ మహిళ పట్ల దారుణంగా వ్యవహరించారు. చికిత్స పొందుతున్న నర్సింగ్‌హోమ్‌లో మహిళ రెండు కిడ్నీలు చోరీకి గురయ్యాయి. సుఖ దుఃఖాల్లో తోడుగా ఉంటానని పెళ్లి ప్రమాణాలు చేసిన భర్త కూడా ఆమెను అనాథగా వదిలేసి పారిపోయాడు. ముగ్గురు పిల్లలతో ఆ మహిళ ధీన స్థితిలో రోధిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. ఈ సంఘటన బీహార్ రాష్ట్రం ముజఫర్‌పూర్‌లో చోటు చేసుకుంది. ముజఫర్‌పూర్‌లోని ఓ ఆసుపత్రిలో చేరిన సునీత గర్భాశయంలో ఇన్ఫెక్షన్ సోకడంతో చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఓ నర్సింగ్ హోమ్ కు వెళ్లింది. అక్కడ డాక్టర్ రెండు కిడ్నీలు తీసేశాడు. ప్రస్తుతం సునీత ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది. రోజురోజుకూ ఆమె పరిస్థితి మరింత దిగజారుతోంది. ప్రతి రెండు రోజులకోసారి డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. చాలా మంది కిడ్నీలు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా ఆమెకు సరిపోకపోవడంతో మార్పిడి చేయలేకపోయారు.
సునీత ముగ్గురు పిల్లలు కూడా తమ తల్లి పరిస్థితిని అమాయక కళ్లతో చూస్తుండటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయులు. ఇప్పుడు తన పరిస్థితి ఏంటో తెలియటం లేదని, తన పిల్లలకు ఎవరూ తోడుంటారంటూ ఆ తల్లి గుండెలవిసేలా రోధిస్తుంది. సునీత ఆస్పత్రిలోనే ఉండగా, ఆమె గొడవపడ్డ ఆమె భర్త..అక్లూ రామ్ భార్యను, ముగ్గురు పిల్లలను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడని బాధితురాలు వాపోయింది.
తన భర్తతో గొడవ గురించి ప్రస్తావిస్తూ, సునీత వెక్కి వెక్కి ఏడుస్తుంది. తన ఆరోగ్యం సరైన స్థితిలో ఉన్నప్పుడు తానే కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేదానిని, ఇప్పుడు రెండు కిడ్నీలు లేకపోవడంతో ఏ పనిచేసుకోలేక పోతున్నానంటూ రోదిస్తుంది. తన భర్త చివరి మాటలను గుర్తు చేసుకుంటూ, ‘వెళ్లేటప్పుడు, అతను చెప్పాడు – ఇప్పుడు నీతో జీవితం గడపడం కష్టం. నువ్వు బతికినా, చచ్చినా నేను పట్టించుకోను. తన భర్త తనను విడిచిపెట్టి వేరే పెళ్లి చేసుకుంటాడేమోనని సునీత్ భయపడుతోంది. సునీత తల్లి ఆసుపత్రిలో ఆమెను చూసుకుంటుంది. ఆసుపత్రి యాజమాన్యం కూడా సునీతకు సహాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇప్పటివరకు వచ్చిన దాతలలో ఎవరి కిడ్నీ ఆమెకు సరిపోలేదని తెలిసింది.
సెప్టెంబర్ 3న సునీతాదేవి గర్భాశయానికి ఆపరేషన్ చేయకుండా నకిలీ వైద్యులు కిడ్నీలను తొలగించారు. మహిళ పరిస్థితి విషమించడంతో, డాక్టర్, క్లినిక్ డైరెక్టర్ పవన్ ఆమెను పాట్నాలోని నర్సింగ్ హోమ్‌లో చేర్పించి అక్కడ్నుంచి పరారైనట్లు తెలిసింది. వైద్యులు మోసపూరితంగా ఈ ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులు పవన్‌ని అరెస్టు చేసి జైలుకు తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..