ఇక్కడ కొడుకు పుట్టాడు అక్కడ తండ్రి అంత్యక్రియలు…11 ఏళ్ల కూతురి చేతుల మీదుగా అంత్యక్రియలు..
ఈ ప్రమాదంలో తేజారామ్, మోహన్‌లాల్, రాజురాం మృతి చెందగా, మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులతో పాటు కారు డ్రైవర్ చనిపోయాడు. ప్రమాదం జరిగిన 11 గంటల తర్వాత కారు డ్రైవర్ రాజురాం భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది. రాజురాంకు ఇప్పటికే ముగ్గురు కుమార్తెలు. కొడుకు కోసం ఎదురు చూస్తున్నారు.. కానీ భర్త, కొడుకు ముఖం చూడకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లటంతో ఆ ఇల్లాల్లు కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ విషాద సంఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. జోధ్‌పూర్‌కు 90 కిలోమీటర్ల దూరంలో ట్రైలర్, కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు పోలీసులతో పాటు కారు డ్రైవర్ మృతి చెందారు. డ్రైవర్ రాజురామ్ మరణించిన 11 గంటల తర్వాత, అతని భార్య ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. రాజురాం భార్య శిపు దేవి తన భర్త కోసం ఎదురు చూస్తున్నానని, అతను రాలేదని చెప్పింది. కొడుకు కోసం తమెంతగానో ఎదురు చూశామని, కొడుకును చూడకుండానే తన భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని తెలిసి కుప్పకూలిపోయింది.
భర్త చనిపోవడంతో శిపు దేవి రోదనలు మిన్నంటాయి. కొడుకును చేతిలో పెట్టుకుని హాస్పిటల్ లో ఉన్న భర్త ఫోటో చూస్తూ విలపించిన తీరు అందరినీ కలచివేసింది. తనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని షిపు దేవి తెలిపారు. కొడుకు కోసం ఎదురు చూస్తున్నామని చెప్పింది. కానీ, తన భర్త, కొడుకు ముఖం చూడకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. రాజు, షిపులకు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె 11 ఏళ్ల దిల్ఖుష్, 7 ఏళ్ల డింపుల్, ఏడాది పాప రీనా. ఆదివారం పెద్ద కూతురు దిల్‌ఖుష్ తండ్రికి తలకొరివి పెట్టింది.
రాజు తన తండ్రికి ఒక్కడే కొడుకు కావడంతో డ్రైవింగ్ చేస్తూ ఇంటిని నడిపేవాడు. అయితే, ఇప్పుడు ఆ కుటుంబంపై కొండంత విషాదం నెలకొంది. మనవడు రాకముందే కొడుకును పోగొట్టుకున్నామంటూ మృతుడు రాజు తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. వారి గ్రామం మొత్తం శోకసంద్రంగా మారింది. ఇంట్లో తీరని విషాదం నెలకొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..