AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంబాసిడర్ కారు ధర 16 వేలు మాత్రమే! ఇంత ధర తగ్గడానికి కారణం ఏంటో తెలుసా?

ఇప్పటికీ చాలా మంది ఈ కారును ఉపయోగిస్తున్నారు. హిందూస్థాన్ మోటార్స్ 1957లో అంబాసిడర్ కారును విడుదల చేసింది. ఇది బ్రిటిష్ కారు ఆధారంగా రూపొందించబడింది. ఈ కారు 80ల వరకు ప్రజల హృదయాలను ఏలింది. అయితే ,..

అంబాసిడర్ కారు ధర 16 వేలు మాత్రమే! ఇంత ధర తగ్గడానికి కారణం ఏంటో తెలుసా?
Ambassador Car
Jyothi Gadda
|

Updated on: Jan 30, 2023 | 8:14 AM

Share

అంబాసిడర్ కారు అందరికీ గుర్తుండే ఉంటుంది.. దీనిని మన రాజకీయాలు, సినిమాల్లో ఎక్కువగా కనిపించేవి. రాజకీయ నాయకుల నుండి పరిపాలనలో ఉన్న వ్యక్తుల వరకు అప్పట్లో విస్తృతంగా ఉపయోగించారు. ఇప్పటికీ చాలా మంది ఈ కారును ఉపయోగిస్తున్నారు. హిందూస్థాన్ మోటార్స్ 1957లో అంబాసిడర్ కారును విడుదల చేసింది. ఇది బ్రిటిష్ కారు ఆధారంగా రూపొందించబడింది. ఈ కారు 80ల వరకు ప్రజల హృదయాలను ఏలింది. అయితే మారుతీ సుజుకీ వచ్చిన తర్వాత దాని ఆదరణ తగ్గింది. దీని ఉత్పత్తి 2014లో ఆగిపోయింది. కానీ ఈ కారుప్రయాణం అంటే.. ఇప్పటికీ ‘గర్వించదగ్గ రైడ్’గానే పరిగణింపబడుతుంది.

ఆనాటి అంబాసిడర్ ధర: తాజాగా, 1972 అంబాసిడర్ కారు ధరకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రత్యేకంగా, ఈ ఫోటోలని ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేశారు. ఇందులో 50 ఏళ్ల క్రితం జనవరి 25, 1972 నాటి వార్తలను చూపారు. ‘కార్ల ధరలు పెరిగాయి’ అనే వార్త హెడ్డింగ్. ఈ వార్త చదివాక 1972లో అంబాసిడర్ ధర 127 రూపాయలు పెరిగి 16,946 రూపాయలకు చేరింది. ఆ తర్వాత ఈ కారు కొత్త ధర ₹ 16,946 అయింది. ఇది కాకుండా, ఫియట్ కారులో రూ.259 పెరిగిన తర్వాత, దాని ధర రూ.15,946కి పెరిగింది. ఈ వార్త చదివి ఆనంద్ మహీంద్రా కూడా ఆశ్చర్యపోయారు. ఈ ధరలు విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదే విషయాన్ని స్వయంగా ఆనంద్ మహీంద్రా చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఆనంద్ మహీంద్రా షాక్: ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేస్తూ, “ఇది నన్ను ‘సండే మెమోరీస్’లోకి తీసుకెళ్లిందన్నారు. అప్పుడు తాను జేజే కాలేజీలో ఉన్నానని, బస్సులో కాలేజీకి వెళ్లేవాడినని చెప్పారు. కానీ, మా అమ్మ అప్పుడప్పుడు తన నీలిరంగు ఫియట్ కారును నడపడానికి నన్ను అనుమతించేది. అయితే ఆ కారు ఇంత విలువైనదని నాకు అప్పుడు తెలియదు. అంటూ రాశారు.

ఈ పోస్ట్‌పై సోషల్ మీడియా యూజర్ స్పందిస్తూ.. 1972లో మా నాన్న అంబాసిడర్ కారును రూ. 18000కి కొన్నారు అని రాశారు. మరొక వినియోగదారు ఇది ఖరీదైనది. అదే సమయంలో ఇతర వినియోగదారులు భారతదేశంలో రూపాయి క్షీణతపై ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
డుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ..
డుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ..
వేసవిలో టీ తాగడం మానలేకపోతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
వేసవిలో టీ తాగడం మానలేకపోతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!