- Telugu News Photo Gallery Most Dangerous Dog Breeds in the World, you Know banned dogs Breeds Telugu News
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవి.. వీటికి చిక్కారంటే బొక్కలు చుర చూరే..!
ప్రపంచంలో చాలా భయంకరమైన, ప్రమాదకరమైన జాతి కుక్కలు ఉన్నాయి. అవి దాడి చేస్తే తప్పించుకోవడం అసాధ్యం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇలాంటి జాతుల శునకాలు వాటి ప్రత్యేక ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Jan 28, 2023 | 2:09 PM

బాక్సర్: ఇది వేట కుక్క. కాపలాదారు కూడా. జర్మన్ మూలం. చాలా శక్తివంతమైన దవడలతో, ఈ కుక్క కాటు కూడా తీవ్రంగా ఉంటుంది.

బుల్‌మాస్టిఫ్: ఈ కుక్క బరువు 130 పౌండ్లు, దూకుడు స్వభావం కలిగి ఉంటుంది. UKలో పుట్టింది. వాటికి శిక్షణ ఇస్తే యజమాని చెప్పేది వింటుంది. లేకుంటే ప్రమాదమే. ఇవి చిన్న జంతువులపై సులభంగా దాడి చేస్తాయి.

డాబర్‌మాన్ పిన్‌షర్: ఈ కుక్కను పోలీసు విభాగాల్లో ఉపయోగిస్తారు. జర్మనీలో పుట్టింది. అపరిచితులతో దూకుడుగా ప్రవర్తిస్తుంది. ఇటీవలి సంవత్సరాలలో ఈ జాతికి ప్రజాదరణ పెరిగింది.

జర్మన్ షెపర్డ్: ఇది అత్యంత ప్రసిద్ధ జాతి. జర్మనీలో పుట్టింది. దీని కాటు మొత్తం 1,060 న్యూటన్ల శక్తిని కలిగి ఉంటుంది. సాధారణంగా పోలీసు డిపార్ట్‌మెంట్లలో, కొందరు జంతుప్రేమికుల ప్రేమికుల ఇళ్లలో కనిపిస్తాయి.

హస్కీ: అధిక శక్తి గల హస్కీ కుక్కను ఇంట్లో ఉంచుకోవడం ప్రమాదకరం. ఇది సైబీరియాకు చెందినది. అమెరికాలో 15 మరణాలకు హస్కీ కుక్కలే కారణమని అనుమానిస్తున్నారు.

పిట్ బుల్: ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కుక్క. అమెరికాకు చెందినది. పిట్ బుల్ బ్రీడింగ్ చాలా దేశాల్లో నిషేధించబడింది. ప్రమాదకరమైన కుక్క జాతులు

వోల్ఫ్ హైబ్రిడ్: ఇది తోడేళ్ళను పోలి ఉండే కుక్క. ఇథియోపియాలో పుట్టింది. ఈ కుక్కలు జన్యుపరంగా ప్రమాదకరమైనవిగా పరిగణించబడతాయి. కొన్ని దేశాల్లో వాటిని పెంపకం చట్టవిరుద్ధం.





























