Non-Veg: టేస్టీగా ఉందని నాన్-వెజ్ లాగిస్తున్నారా.. మీ ఇష్టానికి ఇలా బ్రేకులు పడొచ్చు.. ఎందుకంటే..
ఆరోగ్యకరమైన, ఫిట్ లైఫ్ కోసం ఆహారం, పానీయాలపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. మనం తినే ఆహారం మన జీవితకాలాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో నిపుణుల తాజా పరిశోధనల్లో తేలింది. అవేంటో తెలిస్తే మీరుకూడా షాకవుతారు.

నేటి బిజీ లైఫ్ స్టైల్ వల్ల చాలా మంది తమ శరీరానికి తగిన సమయం ఇవ్వలేకపోతున్నారు. ఈ కారణంగానే చాలా మంది చిన్న వయసులోనే రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. అటువంటి పరిస్థితిలో, ఆరోగ్యకరమైన, ఫిట్ లైఫ్ కోసం ఆహారంపై శ్రద్ధ చూపడం అవసరం. మనం తినే ఆహారం మన జీవితకాలాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో న్యూయార్క్‌లోని బెర్గెన్ యూనివర్సిటీ నిపుణులు పరిశోధించారు. మాంసాహారం తీసుకోని వారు తమ ఆహారంలో రెడ్ మీట్, చికెన్ , ఇతర ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలని అధ్యయనం నిర్వహించిన నిపుణులు సూచించారు.
ఈ మాంసం ఊబకాయం, మధుమేహం, క్యాన్సర్‌కు కారణమవుతుంది. దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఆయుష్షు కూడా తగ్గుతుంది. చాలా మంది ప్రజలు అకాల మరణానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది. బదులుగా, ఆహారంలో తృణధాన్యాలు, చిక్కుళ్ళు, ఆకు కూరలు, పండ్లు, గింజలను చేర్చాలని సిఫార్సు చేయబడింది.
ఎక్కువ మాంసం తినడం వల్ల కలిగే నష్టాలు
హెల్త్ లైన్ నివేదిక ప్రకారం, మొక్కల ఆధారిత ప్రోటీన్‌కు బదులుగా జంతు ఆధారిత ప్రోటీన్ తీసుకోవడం ఆరోగ్యానికి మరింత ప్రమాదకరం. ఎందుకంటే ఇది మీ ఎముకలను బలహీనపరుస్తుంది. మాంసాహారాన్ని నియంత్రించలేని వ్యక్తులు ఎముక పగుళ్లు, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతారు.
9 రకాల వ్యాధుల ప్రమాదం
ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన BMC మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ కొత్త అధ్యయనంలో, ఒక వ్యక్తి వారంలో 3 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఎర్ర మాంసం, ప్రాసెస్ చేసిన మాంసం, చికెన్ వంటి పౌల్ట్రీ మాంసాన్ని తింటుంటే, టర్కీని తీసుకుంటే, అప్పుడు 9 రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
నిపుణులు ఏమి సిఫార్సు చేస్తారు?
సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ, తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా, ఎముకల ఆరోగ్యానికి ప్రోటీన్ చాలా అవసరం, అయితే చాలా జంతు ఆధారిత ప్రోటీన్, ముఖ్యంగా రెడ్ మీట్ ఎముకలను దెబ్బతీస్తుందని చెప్పారు. కాబట్టి మనం ఆహారంలో పాల ఉత్పత్తులు, చేపలు, చికెన్, మొక్కల ఆధారిత ప్రొటీన్లను ఎక్కువగా చేర్చుకోవాలి. పండ్లు, కూరగాయలు, పప్పులు పుష్కలంగా తినడం ద్వారా మీ శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ను పొందవచ్చు.
కాల్షియం లోపం ప్రమాదం
అంజలి ముఖర్జీ మాట్లాడుతూ, ‘అధిక ప్రోటీన్ ఆహారం మీ ఎముకలను ప్రభావితం చేస్తుంది. కాల్షియం లోపానికి కూడా దారి తీస్తుంది. రెడ్ మీట్ వల్ల మన రక్తం ఆమ్లంగా మారుతుంది. ఎముకల నుండి కాల్షియం బలహీనపడుతుంది. అందుకే మాంసాహారాన్ని పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం