రంగురంగుల కాలీఫ్లవర్‌ను పండించిన రైతన్న.. జీవితాన్ని పువ్వులా మార్చేసుకున్నాడు..

ఈ కాలీఫ్లవర్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కంటి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పర్పుల్ వాలెంటినాలో ఆరోగ్యానికి మేలు చేసే ఆంథోసైనిన్ అనే పోషకం పుష్కలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

రంగురంగుల కాలీఫ్లవర్‌ను పండించిన రైతన్న.. జీవితాన్ని పువ్వులా మార్చేసుకున్నాడు..
Cauliflowers
Follow us

|

Updated on: Jan 30, 2023 | 12:30 PM

కోల్‌కతా: వ్యవసాయం అనేది కష్టపడి పనిచేయాల్సిన రంగం. అలాగే కనిష్ట లాభం కంటే, చాలా వరకు ఇక్కడ నష్టమే కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో వినూత్న ఆవిష్కరణలు చేసేందుకు ఎంతోమంది రైతులు నిరంతరం శ్రమిస్తుంటారు. అయితే, ఎన్ని నష్టాలు, కష్టాలు వచ్చినా అప్పులు వదులు కోకుండా వ్యవసాయంలో వినూత్నత తీసుకొచ్చిన రైతులు మన మధ్యలో ఎందరో ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఓ రైతు కూడా అలాంటిదే ఓ సరికొత్త పంటదిగుబడి సాధించాడు.. రంగురంగుల కాలీఫ్లవర్ ను పెంచి తన జీవితాన్ని రంగులమయం చేసుకున్నాడు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ప్రమథా మాఝీ. 62 ఏళ్ల రైతు సాధించిన ఘనత ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

పశ్చిమ బెంగాల్‌కు చెందిన రైతు తూర్పు మిడ్నాపూర్‌ జిల్లా కోలాఘాట్‌ బృందాబన్‌ చక్‌ గ్రామంలో నివాసముంటున్నాడు. ఆయనకు దాదాపు మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో రంగురంగుల కాలీఫ్లవర్‌లు పండించి లాభాలు గడిస్తున్నాడు ప్రమథా మాఝీ. అతని పొలంలో కుంకుమపువ్వు, ఆకుపచ్చ, గులాబీ రంగులో కాలీఫ్లవర్లు పండిస్తున్నాడు. ఆన్‌లైన్ మార్కెట్‌లో క్యాలీఫ్లవర్ విత్తనాలను కొనుగోలు చేసి వివిధ రంగుల కాలీఫ్లవర్ పంటలను పెద్ద ఎత్తున సాగు చేయడం ప్రారంభించాడు.

గతేడాది ఆగస్టు చివరి నాటికి వాలెంటినా, కరోటినా జాతుల కాలీఫ్లవర్‌ విత్తనాలను నాటాడు అది పెరిగి చేతికి రావడానికి 75 నుంచి 85 రోజులు పట్టింది. 2013 నుండి కూరగాయల వివిధ హైబ్రిడ్ పంటల సాగుతో ప్రయోగాలు చేస్తున్నారు. ఈ హైబ్రిడ్ కాలీఫ్లవర్, క్రూసిఫెరస్ లేదా క్యాబేజీ కుటుంబానికి చెందినది. మొక్కల పెంపకందారులు సహజంగా ఈ ఆకుపచ్చ రకాలను వాలెంటినా (నీడ రంగు), కెరోటిన్ (కుంకుమపువ్వు రంగు) మరియు బ్రోకలీ అని పిలుస్తారు.

ఇవి కూడా చదవండి

ఈ కాలీఫ్లవర్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కంటి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పర్పుల్ వాలెంటినాలో ఆరోగ్యానికి మేలు చేసే ఆంథోసైనిన్ అనే పోషకం పుష్కలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అతను 2014 లో మిశ్రమ రంగుల కాలీఫ్లవర్‌ను పెంచడం ప్రారంభించగా, ఇటీవలి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం, అతను సుమారు 8 వేల గ్రీన్ బ్రకోలీ పంటలను నాటాడు. శీతాకాలంలో వాటిని పండించి మార్కెట్‌కు పంపిణీ చేశాడు.

కాగా,మొదటిసారి తాను ఈ పంటను ఒక ప్రయోగంగా చిన్న స్థాయిలో పండించానని చెప్పాడు. కానీ, అది పెద్ద ఎత్తున విజయవంతమైంది. మొత్తానికి వ్యవసాయంలో ఎప్పుడూ కష్టాలను భరిస్తున్న రైతులకు పంట దిగుబడిలో కరకాల ప్రయోగాలు చేస్తూ లాభాలను ఆర్జించడం పట్ల రైతు సంఘం హర్షం వ్యక్తం చేస్తోంది. అన్నదాత సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..