Death Penalty: 2022లో 165 మందికి మరణశిక్ష.. రెండు దశాబ్ధాల్లో రికార్డు స్థాయిలో..
దేశంలో నేరాల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. అయితే.. గతేడాది 2022లో దేశంలోని ట్రయల్ కోర్టులు అత్యధికంగా 165 మందికి మరణశిక్ష విధించాయి. గత రెండు దశాబ్దాలలో ఇంతమందికి మరణ శిక్ష విధించడం ఇదే అత్యధికం.
దేశంలో నేరాల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. అయితే.. గతేడాది 2022లో దేశంలోని ట్రయల్ కోర్టులు అత్యధికంగా 165 మందికి మరణశిక్ష విధించాయి. గత రెండు దశాబ్దాలలో ఇంతమందికి మరణ శిక్ష విధించడం ఇదే అత్యధికం. చివరి సారి 2021లో 146 మంది ఖైదీలకు మరణశిక్ష విధించారు. అయితే, ఉరిశిక్ష కేసుల్లో దాదాపు మూడింట ఒక వంతు మంది నేరస్థులు లైంగిక నేరానికి పాల్పడిన వారే ఉన్నారు. 2022 చివరి నాటికి 539 మంది ఖైదీలకు మరణశిక్ష విధించారు. 2016 నుంచి ఇది అత్యధికమని నివేదికలో తేలింది. అయితే, సంవత్సరాలుగా ఖైదీల సంఖ్య క్రమంగా పెరిగింది. 2015 నుంచి 2022 వరకు 40% మేర ఖైదీల సంఖ్య పెరిగింది. ట్రయల్ కోర్టులు పెద్ద సంఖ్యలో మరణశిక్షలు విధించడం.. ఆ తర్వాత అప్పీలేట్ కోర్టుల ద్వారా అటువంటి కేసులను పరిష్కరించడంలో ఆలస్యం కావడం దీనికి కారణమని చెప్పవచ్చు.
ఈ గణాంకాలను ఢిల్లీలోని NLUలో ప్రాజెక్ట్ 39A ద్వారా ప్రచురించిన ‘భారతదేశంలో మరణశిక్ష: వార్షిక గణాంకాలు 2022’లో ప్రచురించారు. 2008 వరుస పేలుళ్ల కేసులో అహ్మదాబాద్ కోర్టు 2022 ఫిబ్రవరిలో 38 మందికి మరణశిక్ష విధించడం వల్ల 2022లో వాటి సంఖ్య గణనీయంగా పెరగడానికి కారణమైంది. 2016లో 153 కేసుల్లో 27 లేదా 17.6% లైంగిక నేరాలకు మరణశిక్ష విధించారు. 2022లో 165 కేసుల్లో ఈ సంఖ్య 52 లేదా 31.5%కి పెరిగింది. లా ప్రొఫెసర్, ప్రాజెక్ట్ 39A ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ సురేంద్రనాథ్ మాట్లాడుతూ.. పెరిగిన మరణశిక్ష కేసుల సంఖ్యలు ట్రయల్ కోర్టులలో పెరుగుతున్న విషయాలను ప్రతిబింబిస్తాయని చెప్పారు. మహమ్మారి కారణంగా 2020లో తగ్గినప్పటి నుంచి ట్రయల్ కోర్టులు అధిక సంఖ్యలో మరణశిక్షలను విధించడం ప్రారంభించాయి” అని ఆయన చెప్పారు.
మరణశిక్ష అమలులో ఉన్న తీవ్ర సమస్యలను ఎత్తిచూపేందుకు సుప్రీంకోర్టు చేస్తున్న ప్రయత్నాలకు ఇది పూర్తి విరుద్ధంగా ఉందని సురేంద్రనాథ్ అన్నారు. గత ఏడాది మేలో, మరణశిక్ష కేసుల్లో శిక్ష విధించే సమయంలో పరిస్థితులను తగ్గించడంపై విషయాలను ముందస్తుగా సేకరించడం ట్రయల్ కోర్టుల విధి అని సుప్రీంకోర్టు పేర్కొంది. అటువంటి సమాచారాన్ని సేకరించడానికి మార్గదర్శకాలను సైతం జారీ చేసిందని.. సంస్కరణల ఆవశ్యకతను గుర్తించాలని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్ట్ 39A ద్వారా నిర్వహించే పరిశోధనలో ఇలాంటివి పదేపదే కనిపిస్తున్నాయన్నారు. అయితే.. ఉరిశిక్ష పడిన ఖైదీల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశమని తెలిపారు. ఈ సంఖ్య డిసెంబర్ 2016లో 400 నుంచి డిసెంబర్ 2022 నాటికి 539కి పెరిగింది. అత్యధిక మరణశిక్ష విధించిన ఖైదీల్లో టాప్ లో ఉత్తరప్రదేశ్ (100), ఆ తర్వాత గుజరాత్ (61), జార్ఖండ్ (46) ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..