Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airplane Mileage: ఇది ఎప్పుడైనా ఆలోచించారా..? ఒక లీటర్ ఇంధనంతో విమానం ఎంత దూరం వెళ్తుందో తెలుసా..

విమానం లేదా హెలికాఫ్టర్ ప్రయాణంతో సులభంగా.. అతితక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. అయితే, విమానం ఇంధనం (ఎయిర్‌క్రాఫ్ట్ టర్బైన్ ఫ్యూయల్) తో ఎలా నడుస్తుంది.. ఒక లీటర్ ఇంధనం ఎంత మైలేజీ ఇస్తుంది..

Airplane Mileage: ఇది ఎప్పుడైనా ఆలోచించారా..? ఒక లీటర్ ఇంధనంతో విమానం ఎంత దూరం వెళ్తుందో తెలుసా..
Airplane
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 29, 2023 | 1:29 PM

అర్జెంట్‌గా ఎక్కడికైనా వెళ్లాలన్నా.. త్వరగా చేరుకోవాలన్నా చాలామంది ఫ్లైట్‌లను ఆశ్రయిస్తారు. దీనికి మించిన ఉత్తమమైన ఎంపిక ఏదీ లేదు. ఎందుకంటే.. విమానం లేదా హెలికాఫ్టర్ ప్రయాణంతో సులభంగా.. అతితక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. అయితే, విమానం ఇంధనం (ఎయిర్‌క్రాఫ్ట్ టర్బైన్ ఫ్యూయల్) తో ఎలా నడుస్తుంది.. ఒక లీటర్ ఇంధనం ఎంత మైలేజీ ఇస్తుంది..? ఇలాంటి విషయాలను మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? చాలామంది ఆలోచించరు.. అయితే, కొంతమందికి మాత్రం ఇలాంటి సందేహాలు తరచూ వస్తుంటాయి. కానీ విమానం లీటరుకు ఎంత మైలేజీ ఇస్తుంది అనేది చెప్పడం అంత సులభమైన పనికాదంట.. ఎందుకంటే.. విమానం మైలేజీ అనేది వేగం.. ఎత్తు, తదితర విషయాలను పరిగిణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

దీనికి సమాధానం చెప్పడం కష్టం కావడానికి ప్రధాన కారణం “సగటు ప్రయాణీకుల విమానం” అనే నిర్వచనం. దీనికి జవాబు చెప్పడానికి కష్టంగా ఉండటానికి మరొక కారణం ఏమిటంటే.. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా ఇంధన వినియోగంలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. విమానం బరువు, విమానం ఎత్తు, వాతావరణ పరిస్థితులు.. ఇలా అనేకమైన విషయాలు ఉన్నాయి.

మీరు ఒక విమానం మైలేజీని km/lలో లెక్కించాలనుకుంటే.. భూమి వేగాన్ని అర్ధం చేసుకోవాలి. B737 సాధారణంగా ఒక్కో ఇంజన్‌కు నిమిషానికి 20 లీటర్ల ఇంధనాన్ని వినియోగిస్తుంది. అంటే, రెండు ఇంజన్లు నిమిషానికి 40 లీటర్ల ఇంధనాన్ని కాల్చేస్తాయి. వేగం సాధారణంగా గంటకు 900 కి.మీ. ఈ విధంగా లెక్కిస్తే గంటకు 2400 లీటర్ల ఇంధనం ఖర్చవుతుంది. ఒక గంటలో దూరం = 900 కి.మీ. కావున ప్రతి కిలోమీటరుకు 2.6 లీటర్ల ఇంధనం ఖర్చవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక లీటర్ ఇంధనం 384 మీటర్ల మైలేజీని మాత్రమే అందిస్తుంది. ఈ రకమైన విమానాల సామర్థ్యం 189 మంది ప్రయాణికుల వరకు ఉంటుంది. మీరు ఎత్తులో.. వినియోగించే ఇంధన పరిమాణాన్ని మాత్రమే చూస్తే సరైన లెక్క తేలదు. విమానం టేకాఫ్ దశలో చాలా ఇంధనాన్ని వినియోగిస్తుంది. కానీ దీనికి విరుద్ధంగా ఇంజిన్లు ల్యాండింగ్ సమయంలో తక్కువ ఇంధనాన్ని వినియోగిస్తాయి. ఇలా ప్రయాణికుల విమానం.. జెట్ ల మైలేజీలో మార్పు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

విమాన ఇంధనాన్ని ఎయిర్‌క్రాఫ్ట్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) అంటారు. విమానాల్లోని వాటి ఇంజన్ రకాన్ని బట్టి వాటిలో ఎలాంటి ఇంధనాన్ని వినియోగించాలనేది నిర్ణయిస్తారు. సాధారణంగా ఈ విమానాల్లో రెండు రకాల ఇంధనాన్ని ఉపయోగిస్తారు. ఈ ఇంధనాలు జెట్ ఇంధనం, ఏవిగాస్ ను ఉపయోగిస్తారు. జెట్ ఇంజన్ల కోసం జెట్ ఇంధనాన్ని ఉపయోగిస్తారు. అదే సమయంలో, చిన్న టర్బోప్రాప్ విమానాలలో ఇంజిన్ పిస్టన్‌లను నడపడానికి ఏవిగాస్ ను ఉపయోగిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..