AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coconut Water: హీరో, హీరోయిన్లు కొబ్బరి నీళ్లు ఎందుకు తాగుతారో తెలుసా..? సీక్రెట్ ఎంటంటే..

కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలామంచిది. సాధారణంగా మార్నింగ్ వాక్‌కి వెళ్లేటప్పుడు కొందరు కొబ్బరి నీళ్లు తాగడాన్ని తరచుగా చూసి ఉంటారు. చాలా మంది నటులు లేదా ఫిట్‌నెస్ ఫ్రీక్స్‌ల ఆహారంలో కొబ్బరి నీరు తప్పనిసరిగా ఉంటుంది.

Coconut Water: హీరో, హీరోయిన్లు కొబ్బరి నీళ్లు ఎందుకు తాగుతారో తెలుసా..? సీక్రెట్ ఎంటంటే..
Coconut Water
Shaik Madar Saheb
|

Updated on: Jan 28, 2023 | 12:20 PM

Share

కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలామంచిది. సాధారణంగా మార్నింగ్ వాక్‌కి వెళ్లేటప్పుడు కొందరు కొబ్బరి నీళ్లు తాగడాన్ని తరచుగా చూసి ఉంటారు. చాలా మంది నటులు లేదా ఫిట్‌నెస్ ఫ్రీక్స్‌ల ఆహారంలో కొబ్బరి నీరు తప్పనిసరిగా ఉంటుంది. కొబ్బరి నీరు చాలా రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యంపై అవగాహన ఉన్నవారు ముఖ్యంగా కొబ్బరినీళ్లు తాగడానికి ఇష్టపడతారు. కొబ్బరి నీళ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కేలరీలు, చక్కెర, పిండి పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

కొబ్బరు నీరు ప్రయోజనాలు..

  1. బరువు తగ్గుతారు: బరువు తగ్గడానికి కొబ్బరి నీళ్లు తాగడం చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఇందులో ఉండే బయోయాక్టివ్ ఎంజైమ్‌లు జీవక్రియను పెంచి బరువు తగ్గించడంలో సహాయపడతాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల క్యాలరీలు వేగంగా కరిగిపోతాయి. మీరు ఫిట్ బాడీని పొందాలంటే ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగాలి.
  2. రక్తపోటును నియంత్రిస్తుంది: కొబ్బరి నీళ్లలో విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అధిక రక్తపోటు రోగులకు కొబ్బరి నీళ్లు తాగడం చాలా మేలు చేస్తుంది.
  3. తక్కువ కొలెస్ట్రాల్: కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కొబ్బరి నీరు శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. దీన్ని తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పోతుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి.
  4. పిత్తాశయ రాళ్లను తొలగిస్తాయి: కొబ్బరి నీరు శరీరాన్ని హైడ్రేట్‌గా చేస్తుంది. ఇది శరీరాన్ని డిటాక్స్ చేయడానికి పని చేస్తుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. ఇది కిడ్నీ స్టోన్ ప్రమాదాన్ని తొలగిస్తుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. చర్మానికి ప్రయోజనకరమైనవి: కొబ్బరి నీళ్లలో ఉండే గుణాలు చర్మానికి చాలా మేలు చేస్తాయి. మొటిమల సమస్యను తొలగించడానికి కొబ్బరి నీరు పనిచేస్తుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి మెరిసేలా చేస్తుంది.

అందుకే ఇన్ని పోషకాలు, ఖనిజాలు ఉన్న కొబ్బరి నీటిని తరచూ హీరోయిన్లు, హీరోలు తీసుకుంటారని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంకా కొబ్బరి నీటిని తీసుకోవడం వల్ల తక్షణమే శక్తి వస్తుందని.. ఎనర్జిటిక్ గా ఉంటారని పేర్కొంటున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..