Watch Video: టైమ్ వేస్ట్ ఎందుకని.. ఇలా ప్లాన్ చేశారు… ఈ చోరీ చూస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వడం పక్కా

దొంగలు ఏటీఎం మిషీన్‌ను ఎత్తుకెళ్లిన ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబందించిన దృశ్యాలు ఏటీఎం బూత్‌లోని సీసీటీవీలో రికార్డయ్యాయి.

Watch Video: టైమ్ వేస్ట్ ఎందుకని.. ఇలా ప్లాన్ చేశారు... ఈ చోరీ చూస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వడం పక్కా
Atm Robbery
Follow us

|

Updated on: Jan 28, 2023 | 10:00 AM

దొంగలు ఏటీఎం మిషీన్‌ను ఎత్తుకెళ్లిన ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబందించిన దృశ్యాలు ఏటీఎం బూత్‌లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. రూపన్‌గర్హ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సుర్సురా ప్రాంతంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ATM బూత్‌లోకి గురువారం రాత్రి ముగ్గురు దొంగలు ప్రవేశించారు. ముగ్గురు వ్యక్తులు కూడా మాస్క్‌లు ధరించి ఉన్నారు. ఆ తర్వాత ఏటీఎంకు గొలుసులు కట్టారు. ఆతర్వాత.. ఏటీఎం మిషన్‌ను అక్కడి నుంచి కదిలించి మరో వాహనంలో షిఫ్ట్ చేసుకుని పరారయ్యారు. ఏటీఎం మిషన్‌లో రూ.8 లక్షలు ఉన్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ సంఘటన అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో జరిగిందని పోలీసులు తెలిపారు.

కాగా, నిందితులను గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇదిలాఉంటే.. దొంగలు పలుచోట్ల కూడా ఇలాంటి తరహాలోనే దొంగతనానికి పాల్పడ్డారు. అరైన్‌ పట్టణంలో జనవరి 24న గుర్తుతెలియని దుండగులు రూ.30 లక్షలకు పైగా నగదు ఉన్న ఏటీఎం యంత్రాన్ని ఎత్తుకుపోయారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

దోపిడీ పద్ధతి ఒకేలా ఉండడంతో రెండు చోరీలు ఒకే ముఠాకు చెందని వారు చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అరైన్చ, రూపన్‌గఢ్‌లో ATM మెషీన్లను దొంగలు ఎత్తుకెళ్లారని.. వాటిల్లో ఉన్న రూ. 8 లక్షలు, రూ. 30 లక్షలు చోరీ అయ్యాయని రూరల్ అదనపు ఎస్పీ వైభవ్ శర్మ తెలిపారు. అయితే ఈ రెండు దోపిడీ కేసులకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..