భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. కారణం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

భార్యభర్తల మధ్య గొడవల సహజమే.. కానీ.. ఓ భార్య మాత్రం భర్త ఆగడాలు భరించలేక తిరగబడింది. ఉన్నట్టుండి అతనిపై దాడిచేసింది.

భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. కారణం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
Woman
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 28, 2023 | 9:35 AM

భార్యభర్తల మధ్య గొడవల సహజమే.. కానీ.. ఓ భార్య మాత్రం భర్త ఆగడాలు భరించలేక తిరగబడింది. ఉన్నట్టుండి అతనిపై దాడిచేసింది. నాలుకను కొరికి.. ఆ తర్వాత కోసేసింది. ఈ షాకింగ్ ఘటన.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్నో జిల్లాకు చెందిన మున్నా, సల్మాకు మూడేళ్ల క్రితం పెళ్లయింది. ఈ దంపతులు మధ్య విభేదాలు తలెత్తడంతో ఏడాది కాలంగా విడివిడిగా ఉంటున్నారని పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో ఆటో డ్రైవర్‌ అయిన మున్నా మద్యం తాగి.. శుక్రవారం లక్నోలోని ఠాకూర్‌గంజ్ రాధాగ్రామ్ ప్రాంతంలోని భార్య ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో తమ బిడ్డను కలవడానికి వీల్లేదంటూ సల్మా పేర్కొంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని అదనపు డిసిపి (వెస్ట్ జోన్) చిరంజీవ్ సిన్హా తెలిపారు. ఈ క్రమంలో కోపోద్రిక్తురాలైన భార్య.. భర్త నాలుకను నోటితో కొరికింది. దీంతో తీవ్రంగా గాయపడిన మున్నా స్పృహ తప్పి పోయాడు. తీవ్ర రక్తస్రావమైందని పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ ట్రామా సెంటర్‌కు తరలించారు. మహిళను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

శుక్రవారం భార్య ఇంటికి వెళ్లిన మున్నా.. పిల్లలను కలవాలని పేర్కొన్నాడని.. ఈ సమయంలో భార్య అడ్డుకోవడంతో ఆమెపై దాడికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. ఈ సమయంలో భార్య అతని నాలుక కొరికిందని పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..