AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: మీ పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలియడం లేదా? మీ ఇంట్లో నుంచే పూర్తి వివరాలు పొందొచ్చు..

ఈపీఎఫ్ ఖాతాదారులు తమ బ్యాలెన్స్ ను ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఆన్ లైన్ సర్వీసెస్ ద్వారా పొందవచ్చు. దీనికి సంబంధించిన వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం యూఏఎన్(UAN) యాక్టివేట్ అయ్యి ఉండాలి. అది మీ మొబైల్ నంబర్ కు అనుసంధానమై ఉండాలి.

EPFO: మీ పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలియడం లేదా? మీ ఇంట్లో నుంచే పూర్తి వివరాలు పొందొచ్చు..
ఇప్పుడు 5 సంవత్సరాల ముందు పీఎఫ్ ఉపసంహరణ చేస్తే, ఖాతాకు పాన్ లింక్ చేయకపోతే TDS 30% ఉండగా.. దానిని 10% శాతానికి తగ్గించినట్లు ప్రకటించారు. ఇది EPFOలోని రికార్డులతో PAN అప్‌డేట్ చేయని వ్యక్తులకు సహాయపడుతుంది.
Madhu
|

Updated on: Jan 28, 2023 | 1:30 PM

Share

ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్).. ప్రతి ఉద్యోగికి సురక్షిత పొదుపు మార్గం. ప్రతి నెలా జీతం నుంచి ఆటోమేటిక్ గా డిడక్ట్ అయ్యి ప్రత్యేక ఖాతాలో జమవుతాయి. ఆ ఖాతానే పీఎఫ్ అంటాం. అయితే ప్రతి నెల ఎంత జమవుతుంది? అసలు ఖాతాలో ఎంత ఉంది? అనే విషయాలు చాలా మంది పట్టించుకోరు. చాలా మందికి అసలు పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో కూడా తెలీదు. మరికొంత మంది పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే పీఎఫ్ ఆఫీస్ కు వెళ్లాలమో అనుకొంటుంటారు. అయితే ఇంట్లో నుంచే మీ మొబైల్ ద్వారానే మీ పీఎఫ్ డీటైల్స్ చెక్ చేసుకోవచ్చు. అందుకు పలు మర్గాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం..

యూఏఎన్ తప్పనిసరి..

ఈపీఎఫ్ ఖాతాదారులు తమ బ్యాలెన్స్ ను ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఆన్ లైన్ సర్వీసెస్ ద్వారా పొందవచ్చు. దీనికి సంబంధించిన వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం యూఏఎన్(UAN) యాక్టివేట్ అయ్యి ఉండాలి. అది మీ మొబైల్ నంబర్ కు అనుసంధానమై ఉండాలి.

యూఏఎన్ అంటే..

ఈపీఎఫ్ లో రిజిష్టర్ అయి ప్రతి ఎంప్లాయీకీ ప్రత్యేకంగా యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్ వస్తుంది. ఇది తన లైఫ్ టైంలో ఒక్కటే ఉంటుంది. ఖాతాదారుడు ఎన్ని కంపెనీలు మారినా ఈ నంబర్ మారదు. దీని ద్వారా మాత్రమే ఖాతాదారుడు తమ అకౌంట్ వివరాలు పొందగలడు. ఇప్పుడు ఖాతా బ్యాలెన్స్ ఎలా పొందాలో చూద్దాం..

ఇవి కూడా చదవండి

ఫోన్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేయడం ఇలా.. ఈపీఎఫ్ ఖాతాదారుడు తన నెలవారీ జీతం నుంచి కట్ అయ్యే నగదు పీఎఫ్ ఖాతాలో జమయ్యాయా లేద అన్నది మీ ఫోన్ లో నుంచే చెక్ చేసుకోవచ్చు. కాల్ చేయడం ద్వారా.. ఈపీఎఫ్ ఖాతాకు లింకై ఉన్న మీ మొబైల్ నంబర్ నుంచి 9966044425 నంబర్ కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు. ఒక రింగ్ తర్వాత కాల్ దానంతట అదే కట్ అయిపోతుంది. తర్వాత ఖాతా వివరాలతో మెసేజ్ వస్తుంది.

మెసేజ్ పంపడం ద్వారా.. పీఎఫ్ ఖాతాకు లింకైన నంబర్ నుంచి EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899కి ఎస్ఎంఎస్ పంపితే తిరిగి అకౌంట్ వివరాలతో మెసేజ్ వస్తుంది. అందుటో పీఎఫ్ కంట్రిబ్యూషన్, బ్యాలెన్స్, కేవైసీ సమాచారం ఉంటుంది. ఇక్కడ UAN అంటే మీ ఖాతాకు సంబింధించిన యూఏఎన్ నంబర్, ENG అంటే ఇంగ్లిష్. ఖాతా వివరాలుమీకు కావాల్సిన భాషలో పొందే వెసులుబాటు ఉంది. ENG స్థానంలో TEL అని టైప్ చేస్తే మెసేజ్ తెలుగులో వస్తుంది. HIN అని టైప్ చేస్తే హిందీలో వస్తుంది. ఇంకా చాలా భాషా ఎంపికలు ఉన్నాయి.

UMANG యాప్ ద్వారా.. మీ స్మార్ట్ ఫోన్ లో UMANG యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలి. తర్వాత మీకు అనువైన భాషను ఎంపిక చేసుకోవాలి. మీ ఫోన్ నంబర్ ను రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత All services ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చిన లిస్ట్ నుంచి EPFO సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత View passbook పైన క్లిక్ చేయాలి. అప్పుడు ఓపెన్ అయిన విండోలో మీ యూఏఎన్ నంబర్ టైప్ చేసి.. మీ మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత లాగిన్ అయ్యి మీ మొబైల్ స్క్రీన్ పై సూచించే విధంగా చేయాలి. అప్పుడు మీ ఈపీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ కనిపిస్తుంది.

ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ ద్వారా.. https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login లింక్ పై క్లిక్ చేసి మీ ఖాతా యూఏఎన్, పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి. మీ ఖాతా పూర్తి వివరాలు, స్టేట్ మెంట్ తో సహా ఓపెన్ అవుతుంది. దానిని పీడీఎఫ్ పార్మాట్ లో దాచుకోవచ్చు కూడా.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

Follow Us
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..