Upper Berth: రైలులో అప్పర్ బెర్త్ బుక్ చేసుకుంటున్నారా..? అయితే మీరు తప్పక తెలుసుకోవలసిన రూల్స్ ఇవే..

భారతీయ రైల్వేస్(Indian Railways) ప్రయాణికుల్లో చాలామంది అడ్వాన్స్‌గా తమ జర్నీని ప్లాన్ చేసుకుంటారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో ఆన్‌లైన్ ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తుంటారు. అలా ట్రైన్ టికెట్..

Upper Berth: రైలులో అప్పర్ బెర్త్ బుక్ చేసుకుంటున్నారా..? అయితే మీరు తప్పక తెలుసుకోవలసిన రూల్స్ ఇవే..
Side Upper Berth In Train Sleeper Class
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 30, 2023 | 7:00 AM

భారతీయ రైల్వేస్(Indian Railways) ప్రయాణికుల్లో చాలామంది అడ్వాన్స్‌గా తమ జర్నీని ప్లాన్ చేసుకుంటారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో ఆన్‌లైన్ ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తుంటారు. అలా ట్రైన్ టికెట్ బుక్ చేసేప్పుడు బెర్త్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. లోయర్ బెర్త్, మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్, సైడ్ లోయర్ బెర్త్, సైడ్ అప్పర్ బెర్త్ అని వేర్వేరు బెర్త్ ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో తమకు కావాల్సిన ఆప్షన్‌ను రైల్వే ప్రయాణికులు ఎంచుకోవచ్చు. ఒకవేళ ఆ బెర్త్ అందుబాటులో ఉంటే ప్రయాణికులు కోరుకున్న బెర్త్‌ను కేటాయిస్తుంది రైల్వే సంస్థ. అయితే వీటిలో అప్పర్ బెర్త్‌కు సంబంధించి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అవేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

రైల్వే ప్రయాణికులు చాలా ముందుగా ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తే తమకు కావాల్సిన బెర్త్ లభించే అవకాశాలు ఎక్కువ. కానీ ప్రయాణ తేదీకి కాస్త ముందుగా బుక్ చేసినట్టైతే ఏ బెర్త్ లభిస్తే ఆ బెర్త్‌లో అడ్జెస్ట్ కావాల్సిందే. అయితే పగటి వేళ సైడ్ లోయర్ సీట్‌లో ఇద్దరు ఆర్‌ఏసీ టికెట్స్ ఉన్నవారు కూర్చున్నట్టైతే.. అప్పర్ బెర్త్‌లో ఉన్నవారు ఎక్కడ కూర్చోవాలి అన్న సందేహం రావడం మామూలే. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వే నియమ నిబంధనలు ఏం చెబుతున్నాయో TV9 పరిశీలించింది.

థర్డ్ ఏసీ క్లాస్ లేదా స్లీపర్ క్లాస్‌లో ప్రతీ సెక్షన్‌లో ఎనిమిది బెర్తులు ఉంటాయి. వాటిలో 2 లోయర్ బెర్త్, 2 మిడిల్ బెర్త్, 2 అప్పర్ బెర్త్, 1 సైడ్ లోయర్ బెర్త్, 1 సైడ్ అప్పర్ బెర్త్ ఉంటాయి. ఒకవైపు 6 బెర్తులు, మరోవైపు 2 బెర్తులు ఉంటాయి. 6 బెర్తులు ఉన్నవైపు 2 లోయర్ బెర్త్‌లల్లో ఆరుగురు ప్రయాణికులు కూర్చోవచ్చు. కాబట్టి మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్‌లో ఉన్నవారు లోయర్ బెర్త్‌లో కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే అవకాశం ఉంటుంది. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు నిద్రపోయే సమయం ఎవరి బెర్త్‌లో వారు నిద్రపోవాలి.

ఇవి కూడా చదవండి

అయితే సైడ్ లోయర్ బెర్త్‌ను ఇద్దరు ప్రయాణికులకు ఆర్‌ఏసీ టికెట్స్ ద్వారా కేటాయిస్తే, సైడ్ అప్పర్ బెర్త్‌లో ఉన్నవారు ఎక్కడ కూర్చోవాలి అన్న సందేహం రావడం సర్వసాధారణం. ఇక్కడ కూడా సేమ్ రూల్స్ వర్తిస్తాయి. సైడ్ లోయర్ బెర్త్ ఒకరికే కేటాయిస్తే సదరు ప్రయాణికుడు ఆ బెర్త్‌లో నిద్రపోతారు. పగలు సైడ్ అప్పర్ బెర్త్‌లో ఉన్న ప్రయాణికుడు వచ్చి లోయర్ బెర్త్‌లో కూర్చోవచ్చు. ఒకవేళ సైడ్ లోయర్ బెర్త్‌ను ఇద్దరు ఆర్ఏసీ ప్రయాణికులకు కేటాయిస్తే, వారి అనుమతితో సైడ్ అప్పర్ బెర్త్‌లోని ప్రయాణికుడు కింది బెర్త్‌లో కూర్చోవచ్చు. కింద ఉన్న ఆర్ఎసీ ఇద్దరు ప్రయాణికుల అనుమతి లేకపోతే అప్పర్ బెర్త్‌లోనే అడ్జెస్ట్ కావాలి.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!