Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Express: వందే భారత్‌లో ఆ తరహా క్లీనింగ్ ప్రక్రియ.. ఇకపై అలా చేయకండి: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్..

ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు మురికి కూపాలుగా మారుతుండటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆహార ప్యాకెట్లు, చెత్తచెదారానికి సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Vande Bharat Express: వందే భారత్‌లో ఆ తరహా క్లీనింగ్ ప్రక్రియ.. ఇకపై అలా చేయకండి: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్..
Ashwini Vaishnaw
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 29, 2023 | 12:05 PM

ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు మురికి కూపాలుగా మారుతుండటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆహార ప్యాకెట్లు, చెత్తచెదారానికి సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైస్పీడ్ రైళ్లను మురికికూపాలుగా మారుస్తున్నారని.. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ పౌరులు.. కేంద్ర రైల్వే మంత్రిని కోరుతున్నారు. దీనిపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. మన రైళ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని కేంద్ర మంత్రి కోరారు. దీంతోపాటు రైల్వే అధికారులకు పలు సూచనలు కూడా చేశారు. రైల్వేలో విమానాల క్లీనింగ్ ప్రక్రియను అవలంబించాలని సూచించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో శుభ్రపరిచే విధానాన్ని మార్చాలని, విమానాల క్లీనింగ్ ప్రక్రియను అనుసరించాలని రైల్వే అధికారులను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం ఆదేశించారు. వందే భారత్ రైళ్లలో చెత్తచెదారం వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్రమంత్రి ఈ ఆదేశాలిచ్చారు.

కొత్త క్లీనింగ్ సిస్టమ్ ప్రకారం.. ఒక వ్యక్తి రైలు కోచ్‌ల మీదుగా చెత్త బ్యాగ్‌తో ప్రయాణీకుల దగ్గరకు వెళ్తాడు. ఈ బ్యాగ్‌లో తమ దగ్గర లేదా చుట్టూ ఉన్న చెత్త వేయాలంటూ ప్రయాణీకులను అభ్యర్థిస్తుంటాడు. ఈ మేరకు కేంద్రమంత్రి ట్విట్ కూడా చేశారు. వందేభారత్ రైళ్లకు క్లీనింగ్ సిస్టమ్ మార్చాం.. మీ సహకారం అందుతుందని ఆశిస్తున్నాం.. అని కేంద్రమంత్రి అన్నారు.

ఇవి కూడా చదవండి

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత దాని వెస్టిబ్యూల్‌లో ఆహార ప్యాకెట్‌లు, ఇతర రకాల చెత్త పేరుకుపోయిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పౌరులు కేంద్ర రైల్వే మంత్రిని చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల కొత్తగా ప్రారంభించిన సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. అందులో ప్లేట్లు, కప్పులు, ఇతర చెత్తచెదారం కనిపించింది. హౌస్‌కీపింగ్ సిబ్బంది నిర్ణీత వ్యవధిలో విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ, రైలు గమ్యస్థానమైన విశాఖపట్నం చేరుకునే సరికి మురికికూపంగా ఉన్నట్లు గుర్తించామని రైల్వే అధికారులు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన రైళ్లను శుభ్రంగా ఉంచాలని, చెత్తను డస్ట్‌బిన్‌లలో వేయాలని రైల్వే ప్రయాణికులను పదే పదే అభ్యర్థిస్తోంది.

ప్రస్తుతం దేశంలో ఎనిమిది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్-విశాఖపట్నం రైలును ఇటీవలనే ప్రారంభించారు. ఇది కాకుండా, న్యూ ఢిల్లీ-వారణాసి, న్యూఢిల్లీ-కత్రా, గాంధీనగర్ రాజధాని- ముంబై, న్యూఢిల్లీ-అంబ్ అందౌరా, చెన్నై-మైసూరు, బిలాస్‌పూర్-నాగ్‌పూర్ మరియు హౌరా-న్యూ జల్‌పైగురి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం..