కండోమ్ లు, గర్భనిరోధక మాత్రల వినియోగం పెరిగాయి.. వాటి సంఖ్య తగ్గాయి.. నివేదికలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..
కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయంలో కండోమ్‌లు, గర్భ నిరోధక మాత్రల అమ్మకాలు పెరిగాయి. తాజాగా.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక విషయాలు వెల్లడించింది...
కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయంలో కండోమ్‌లు, గర్భ నిరోధక మాత్రల అమ్మకాలు పెరిగాయి. తాజాగా.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక విషయాలు వెల్లడించింది. ఆడ, మగ వారిలో స్టెరిలైజేషన్ (పిల్లలు పుట్టకుండా చేసే నివారణ సర్జరీ ) బాగా పడిపోయిందని తెలిపారు. హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (HMIS) నివేదిక ప్రకారం.. 2021-22లో స్టెరిలైజేషన్‌లు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 25 శాతం తగ్గాయని వెల్లడించింది. కండోమ్ పంపిణీ ఏడు శాతం పెరిగిందని, అంతే కాకుండా గర్భనిరోధక మాత్రల వినియోగం రెండింతలు పెరిగిందని వివరించింది. మహమ్మారి ఉన్నప్పటికీ.. 2020-21తో పోలిస్తే కండోమ్ పంపిణీ 7.2 శాతం పెరిగిందని పేర్కొ్ంది. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. కండోమ్‌ల పంపిణీలో బెంగాల్ అగ్రగామిగా ఉంది. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, జార్ఖండ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
2020-21లో 31.45 కోట్లతో పోలిస్తే 2021-22లో 33.70 కోట్ల యూనిట్ల కండోమ్‌లు అమ్ముడయ్యాయి. లాక్‌డౌన్‌కు ముందు 2018-19లో అత్యధికంగా 34.44 కోట్ల మార్కును తాకింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో గర్భ నిరోధక మాత్రల వినియోగం కూడా పెరిగింది. 2020-21లో 57.1 లక్షలతో పోలిస్తే 2021-22లో 76.5 లక్షల గర్భనిరోధక మాత్రలు పంపిణీ అయ్యాయి. 2018-19 లో కేవలం 14.1 లక్షల మాత్రలు మాత్రమే పంపిణీ చేశారు. ఈ మాత్రలకు ఎక్కువ డిమాండ్ ఉత్తరప్రదేశ్ నుండి వచ్చింది. తరువాత పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఉన్నాయి.
మరోవైపు.. స్టెరిలైజేషన్ క్షీణించింది. 2019-20లో 33.52 లక్షల నుండి 2021-22లో 26.97 లక్షలకు పడిపోయింది. 2021-22లో పురుషులు స్టెరిలైజేషన్ (33,635) గా ఉంటే.. ఇది 2020-21 (26,424) నుంచి 27 శాతం మెరుగుపడినప్పటికీ.. 2019-20 (54,239)తో పోలిస్తే 38 శాతం తగ్గింది. మహారాష్ట్ర అత్యధికంగా పురుషుల స్టెరిలైజేషన్‌లను నమోదు చేసింది. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఉన్నాయి. స్త్రీల స్టెరిలైజేషన్ 26.71 లక్షల నుండి 29.75 లక్షలకు పెరిగింది. 2019-20లో 32.98 లక్షలు నమోదు చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..