AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శరీరంలోని ఈ భాగాలపై పుట్టుమచ్చలు ఉంటే.. ఖచ్చితంగా ప్రేమ వివాహమే..!

అలాంటి స్త్రీలు ప్రేమ కోసం ఏమైనా చేయగలరు. ఈ స్త్రీలు పెద్దలు కుదిర్చిన వివాహం కంటే ప్రేమ వివాహాన్ని ఇష్టపడతారు.

శరీరంలోని ఈ భాగాలపై పుట్టుమచ్చలు ఉంటే.. ఖచ్చితంగా ప్రేమ వివాహమే..!
Moles On Body
Jyothi Gadda
|

Updated on: Jan 30, 2023 | 12:29 PM

Share

జ్యోతిష్య శాస్త్రంలో పుట్టుమచ్చలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. దాదాపు ట్టుమచ్చలు లేని వారు ఉండరు. శరీరంపై పుట్టుమచ్చ ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో అందంగా కనిపిస్తారు. కొన్నిసార్లు అది మరకలా కనిపించినా అది మీకు అదృష్టాన్ని తెచ్చి పెడుతుందని జ్యోతిశాస్త్రం చెబుతోంది. వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన, ప్రత్యేకమైన సందర్భం. ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిరిన వివాహమా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. మీ శరీరంపై ఉన్న పుట్టుమచ్చ దీనికి సమాధానం ఇస్తుంది. శరీరంపై ఉన్న మచ్చలను చూసి చాలా అంచనాలు వేసుకోవచ్చు. పెళ్లి గురించి ప్రతి ఒక్కరికీ చాలానే కలలు ఉంటాయి. యుక్తవయస్సు వచ్చిన ప్రతి ఒక్కరూ తమ జీవిత భాగస్వామి ఎలా ఉండాలో తమ మనస్సులో ఆలోచిస్తూనే ఉంటారు. అమ్మాయిలు కూడా తమ కలల రాకుమారుడి కోసం ఎదురుచూస్తుంటారు. ఈ రోజుల్లో పెళ్లి విషయంలో ప్రజల మొదటి ఎంపిక ప్రేమ వివాహమే. అయితే మీది ప్రేమ వివాహమా లేక కుదిరిన వివాహమా అనేది మీరు తెలుసుకోవచ్చు.

కుడి కన్ను మూలలో పుట్టుమచ్చ : స్త్రీలకు కుడి కన్ను మూలలో పుట్టుమచ్చ ఉంటే, వారు ఎల్లప్పుడూ పురుషులను ఆకర్షిస్తారు. అలాంటి స్త్రీల ప్రేమ అదృష్టం చాలా బలంగా ఉంటుంది. వారు జీవితంలో కోరుకున్న భాగస్వామిని పొందుతారు. అలాంటి మహిళలు తమ సంబంధాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని గుర్తుంచుకోవాలి. లేదంటే వారి భాగస్వామి దృష్టి మరల్చవచ్చు.

చెవిలో పుట్టుమచ్చ : స్త్రీకి చెవిలో పుట్టుమచ్చ ఉంటే, ఈ పుట్టుమచ్చ ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తికి మొదట మంచి స్నేహం, ప్రేమ వ్యవహారం, తరువాత వివాహం జరుగుతుందని చూపిస్తుంది. అలాంటి మహిళలు సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు. అందుకే లవ్ మ్యారేజ్ కూడా అరేంజ్డ్ మ్యారేజీగా చేసుకుంటారు. అలాంటి మహిళలు మంచి గృహిణులుగా కూడా గుర్తింపు పొందుతారు.

ఇవి కూడా చదవండి

బుగ్గలపై పుట్టుమచ్చ : స్త్రీకి చెంపపై పుట్టుమచ్చ ఉంటే, అలాంటి స్త్రీలు ఎవరినైనా ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటారు. మరోవైపు, అలాంటి మహిళలు త్వరగా ఒక వ్యక్తితో ప్రేమలో పడరు.

పెదవులపై పుట్టుమచ్చ: పై పెదవిపై పుట్టుమచ్చ ఓపెన్ మైండ్‌కి సంకేతం. అలాంటి మహిళలు ఎవరినైనా ప్రేమిస్తే, వారు తమను తాము ప్రపోజ్ చేసుకోవచ్చు. అలాంటి స్త్రీలు ప్రేమ కోసం ఏమైనా చేయగలరు. ఈ స్త్రీలు పెద్దలు కుదిర్చిన వివాహం కంటే ప్రేమ వివాహాన్ని ఇష్టపడతారు.

చేయిపై పుట్టుమచ్చ : స్త్రీకి చేయి లోపలి భాగంలో పుట్టుమచ్చ ఉంటే ఆమె త్వరగా పెళ్లి చేసుకోవద్దని భావిస్తుంది. అలాంటి స్త్రీలు తమ వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న అబ్బాయిలను ఇష్టపడతారు లేదా వారు తమ వయస్సు కంటే చాలా పెద్ద పురుషులతో ప్రేమలో పడతారు. అలాంటి మహిళలు ఆలస్యంగా పెళ్లి చేసుకుంటారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇలాంటి పుట్టుమచ్చలు ఉన్నవాళ్లు కచ్చితంగా ఇలానే ఉండాలని లేదు. జ్యోతిష్యశాస్ర్తం ఇలా చెబుతుందని మేము వాటిని ఆధారంగా మాత్రమే అందించిన సమాచారం. కేవలం అవగాహన కోసం మాత్రమే.