AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : పెళ్లి తర్వాత కలిసి 40 సినిమాల్లో నటించిన హీరోహీరోయిన్లు.. ఇండస్ట్రీలోనే కెమిస్ట్రీ అంటే ఆ ఇద్దరిదే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ పెయిర్స్ ఉన్నాయి. తెరపైనే కాకుండా రియల్ లైఫ్ జోడీలు సైతం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అయితే మీకు తెలుసా.. ? తెలుగులో సూపర్ హిట్ జోడీ ఎవరిదో. అప్పటికే ఇద్దరూ తోపు హీరోహీరోయిన్లు.. పెళ్లి తర్వాత కలిసి దాదాపు 40 సినిమాల్లో నటించారు. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరంటే.

Tollywood : పెళ్లి తర్వాత కలిసి 40 సినిమాల్లో నటించిన హీరోహీరోయిన్లు.. ఇండస్ట్రీలోనే కెమిస్ట్రీ అంటే ఆ ఇద్దరిదే..
Vijaya Nirmala , Krishna
Rajitha Chanti
|

Updated on: May 25, 2026 | 12:53 PM

Share

సినీ ప్రపంచంలో విజయ నిర్మల, సూపర్ స్టార్ కృష్ణల కలయిక ఒక మధుర జ్ఞాపకం. వివాహానంతరం వీరిద్దరూ కలిసి 40కి పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.ఎక్కడ చూసినా తమ పోస్టర్లే ఉండేవని, ప్రజలు తమను ఒక జంటగా చూడటం, వారి మధ్య కెమిస్ట్రీని ఆస్వాదించడం వల్లే ఇంత ఆదరణ లభించిందని విజయ నిర్మల గతంలో గుర్తు చేసుకున్నారు. మొదటి నుంచి తమ పేరు జనానికి చాలా ఇష్టమని ఆమె పేర్కొన్నారు. కుటుంబ జీవితంలో కృష్ణ కుటుంబ సభ్యుల ఆమోదం పొందడంపై ఆమె మాట్లాడారు. అత్తమామలు, ఆడబిడ్డలు అందరూ తనను ఆదరించారని, వారిని ఒప్పించడంలో కృష్ణ ఇష్టమే కీలకమైందని తెలిపారు. తన వంటల మాయతో అత్తమామల మనసులను గెలుచుకున్నానని, షూటింగ్‌కు వెళ్లే ముందు కూడా అత్తగారికి, మామగారికి అన్ని వంటలు చేసి పెట్టేదాన్నని చెప్పారు. ఒక సందర్భంలో అత్తగారు మరణించే ముందు విజయ నిర్మల చేతి బెండకాయ కూర, రసం తినాలని కోరుకున్నారని, అదే ఆమె చివరి భోజనమని ఆమె భావోద్వేగంతో పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Gunashekar: ఆ హీరో చిన్నప్పుడు కూచిపూడి డ్యాన్స్ చేస్తే.. రవింద్రభారతిలో విజిల్స్ మారుమోగాయి.. డైరెక్టర్ గుణశేఖర్..

తన దర్శకత్వ గురించి మాట్లాడుతూ, కృష్ణతో మూడు సినిమాలు పూర్తయిన తర్వాత దర్శకత్వం వహించాలని అడగ్గా, కృష్ణ తొలుత వంద సినిమాలు హీరోయిన్‌గా పూర్తి చేయమని, అప్పుడే దర్శకత్వం వైపు వెళ్లమని సలహా ఇచ్చారని తెలిపారు. కృష్ణ ఇచ్చిన సలహా మేరకు నటనపైనే దృష్టి సారించి మలయాళం, తెలుగు, తమిళం వంటి భాషలలో సినిమాలు చేశానని, కేరళలోని కొచ్చిన్‌లో ఉన్నప్పుడు కూడా కృష్ణ తనను చూడటానికి వచ్చేవారని చెప్పారు. సుమారు 80 సినిమాలు పూర్తయిన తర్వాత కృష్ణ ప్రోత్సాహంతో దర్శకత్వం ప్రయత్నించమని సలహా ఇచ్చారని పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Surya S/o Krishnan: హార్ట్ టచింగ్.. కుర్రాళ్ల మనసును కదిలించే సాంగ్.. ‘చంచల’ పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..

అలాగే, మలయాళంలో తాను నటించిన అనుభవంతో ఒక మంచి కథ ఉంటే చెప్పమని అడగ్గా, మలయాళ రచయిత కవిత అనే కథను చెప్పారని, తెలుగులో బడ్జెట్ వేయగా ఆరు లక్షలు అయిందని, బ్లాక్ అండ్ వైట్ కాలంలో అది ఎక్కువ కావడంతో మలయాళంలో మొదట చేద్దామని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఆ తర్వాత తెలుగులో తన మొదటి డైరెక్షన్ చిత్రం మీనాను దుక్కిపాటి మసూన్ రావు నవల ఆధారంగా తెరకెక్కించారు. నవల హక్కుల కోసం అడిగినప్పుడు, మాస్ హీరో అయిన కృష్ణతో క్లాస్ పిక్చర్ తీయడంపై, పాటలు లేని చిత్రంపై సందేహాలు వ్యక్తం చేశారని, నాగేశ్వరరావు తో తీయడానికి ఆలోచిస్తున్నానని మసూన్ రావు అన్నారని ఆమె తెలిపారు. అయితే, కృష్ణ అంగీకరించడంతో హక్కులు తనకు లభించాయని, నవలలో ఒక్క ఇంచు కూడా మార్చకుండా చిత్రాన్ని తీశానని విజయ నిర్మల వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Soundarya: సౌందర్య భర్త ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే.. హీరోయిన్ ప్రేమ కామెంట్స్..

విజయ్ నిర్మల, కృష్ణ ఫోటో..

Vijaya Nirmala , Krishna Ne

Vijaya Nirmala , Krishna Ne

ఎక్కువ మంది చదివినవి : Actress : ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. దెబ్బకు రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది.. ఇప్పుడు ఇలా..

Follow Us