బాలీవుడ్‌లో జ్యోతిక బిజీబిజీ
లాంగ్ గ్యాప్ తర్వాత జ్యోతిక తన సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ సాధిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు బాలీవుడ్‌లో కూడా రాణిస్తున్నారు. షైతాన్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చి విజయం అందుకున్నారు. మళ్ళీ కెమెరా ముందుకు వచ్చినప్పుడు టెన్షన్ పడ్డానని, ఇప్పుడు నటనను ఆస్వాదిస్తున్నానని ఆమె తెలిపారు.
సాధారణంగా కెరీర్‌లో లాంగ్ బ్రేక్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్‌లోకి అడుగుపెట్టే నటీమణులు లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులు, సపోర్టింగ్ రోల్స్‌కే పరిమితమవుతుంటారు. అయితే, సౌత్ బ్యూటీ జ్యోతిక ఈ ధోరణిని బ్రేక్ చేసి, బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసుకుంటూ బిజీబిజీగా మారారు. పెళ్లి, కుటుంబం కారణాలతో కెరీర్‌కు బ్రేక్ ఇచ్చిన జ్యోతిక, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తిరిగి నటనలోకి అడుగుపెట్టి విజయాలు సాధించారు. ఒకవైపు ప్రధాన పాత్రల్లో నటిస్తూనే, ఆమె స్టార్ హీరోలతోనూ జోడీ కడుతున్నారు. మలయాళ చిత్రం కాదల్ – ది కోర్లో బాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి సరసన నటించి ఘన విజయం అందుకున్నారు. ఇటీవల షైతాన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సూపర్ హిట్ సాధించారు.
మరిన్ని వీడియో కోసం :
న్యూ రికార్డ్స్ ను టార్గెట్ చేస్తున్న రామాయణ!
టెక్ ప్రపంచంలో సరికొత్త ట్రెండ్ ఏఐ స్థానంలో మళ్లీ ఉద్యోగులు
భారత్‌లో కొత్త ట్రెండ్..పెళ్లికి "నో" చెబుతున్న యంగ్ ఇండియా.!
జాహ్నవి మిస్సింగ్ మిస్టరీ.. పోలీసుల సంచలన ప్రకటన!
ఈసారి వానలు పడవా? జూలైలో ఆకాశం చూడాల్సిందేనా?
యూరప్‌లో ఎండల విధ్వంసం.. కరిగిపోతున్న యూకే రోడ్లు
వాసన చూసి క్యాన్సర్‌ను గుర్తిస్తున్న కుక్కలు
కిలాడీ కస్టమర్.. బిల్లు ఎగ్గొట్టేందుకు సీక్రెట్ ప్లాన్..

