AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: దొంగల ముఠా నాయకుడికి క్యాన్సర్.. ఖరీదైన కార్లు చోరీచేసి వైద్యం చేయిస్తోన్న అనుచరులు

ఓ దొంగల ముఠా లగ్జరీ కార్లను చోరీచేసి, అనంతరం వాటిని అమ్మేసి బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న తమ గ్యాంగ్‌ లీడర్‌కు వైద్యం చేయిస్తున్నారు. ఈ విధంగా దాదాపు 50కి పైగా కార్లను మూడో కంటికి తెలియకుండా మాయం చేశారు...

Crime News: దొంగల ముఠా నాయకుడికి క్యాన్సర్.. ఖరీదైన కార్లు చోరీచేసి వైద్యం చేయిస్తోన్న అనుచరులు
Delhi Crime News
Srilakshmi C
|

Updated on: Jan 31, 2023 | 2:50 PM

Share

ఓ దొంగల ముఠా లగ్జరీ కార్లను చోరీచేసి, అనంతరం వాటిని అమ్మేసి బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న తమ గ్యాంగ్‌ లీడర్‌కు వైద్యం చేయిస్తున్నారు. ఈ విధంగా దాదాపు 50కి పైగా కార్లను మూడో కంటికి తెలియకుండా మాయం చేశారు. ఐతే పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి దొంగల ముఠా గుట్టును ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్కీ (36) అనే వ్యక్తికి ఓ గూడౌన్‌ ఉంది. ఇతని అనుచరులైన మాజిమ్ అలీ (25), సఫీక్ (21), రామ్ సంజీవన్ (62)లు వాహనాలను దొంగిలించి గూడౌన్‌కు తరలించేవారు. అనంతరం నలుగురు కలిసి వాటిని విడిభాగాలుగా విడగొట్టి స్క్రాప్ డీలర్లకు విక్రయించేవారు. ఇలా విక్రయించగా వచ్చిన డబ్బును ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న తమ ముఠా నాయకుడైన అశిష్‌ వైద్యానికి వినియోగించేవారు. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన ఆనంద్ నికేతన్ అనే బాధితుడు తన టొయోటా ఇన్నోవా క్రిస్టా కారు జనవరి 8న చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ కేసు విషయమై ప్రత్యేక దర్యాప్తు కోసం యాంటీ-ఆటో థెఫ్ట్ స్క్వాడ్ (AATS)ను రంగంలోకి దింపారు. వీరి పలు ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా అలీపూర్‌లోని మఖ్మేల్‌పూర్ గ్రామంలోని ఓ గూడౌన్‌లో దొంగిలించబడిన కారును గుర్తించారు. ఏఏటీఎస్‌ బృందం చాకచక్యంగా వ్యవహరించి జనవరి 17న రాత్రి గూడౌన్‌పై దాడి చేశారు. అప్పటికే గూడౌన్‌లో దొంగిలించబడిన కారు భాగాలను విడదీస్తున్న నలుగురు వ్యక్తులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. గత నెల రోజుల్లో వీరు 20 కార్లకుపైగా దొంగిలించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. సంఘటన స్థలంలో 50కిపైగా వాహనాలకు సంబంధించిన విడిభాగాలను పోలీసులు గుర్తించారు. ఈ దొంగల ముఠాపై పలు సెక్షన్ల కింద కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..
వేసవిలో పచ్చి మామిడి కాయలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీకు
వేసవిలో పచ్చి మామిడి కాయలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీకు
మ్యాజిక్ ట్రిక్స్.. ఇవి ఫాలో అయితే బాత్రూమ్‌లో దుర్వాసన ఉండదు..
మ్యాజిక్ ట్రిక్స్.. ఇవి ఫాలో అయితే బాత్రూమ్‌లో దుర్వాసన ఉండదు..
ప్రపంచం ఒక 'కురుక్షేత్రం'.. ప్రధాని మోదీ 'సంబుద్ధి' మంత్రం ఇదే
ప్రపంచం ఒక 'కురుక్షేత్రం'.. ప్రధాని మోదీ 'సంబుద్ధి' మంత్రం ఇదే