AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Cricket: మైదానంలో హద్దు దాటితే అంతే.. నిషేధం, భారీ జరిమానాలు ఎదుర్కొన్న భారత ప్లేయర్లు వీరే

Indian Cricket: ఇటీవలి కాలంలో యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా తన అగ్రెసివ్ సెండ్‌ఆఫ్‌లతో వార్తల్లో నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో డెవాల్డ్ బ్రెవిస్ వికెట్ తీసిన అనంతరం అతను ప్రదర్శించిన తీవ్ర ఆగ్రహంపై ఐసిసి తీవ్రంగా పరిగణించింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను అతనికి డీమెరిట్ పాయింట్ కేటాయించింది.

Indian Cricket: మైదానంలో హద్దు దాటితే అంతే.. నిషేధం, భారీ జరిమానాలు ఎదుర్కొన్న భారత ప్లేయర్లు వీరే
Icc Penalties
Rakesh
|

Updated on: Aug 18, 2026 | 7:15 AM

Share

Indian Cricket: క్రికెట్ మ్యాచ్‌లో వికెట్ పడినప్పుడు ఆటగాళ్లు ప్రదర్శించే భావోద్వేగాలు కామనే. కొన్నిసార్లు ఆ అగ్రెసివ్ సెలబ్రేషన్లు తీవ్ర వివాదాలకు దారితీస్తాయి. బ్యాటర్లను రెచ్చగొట్టేలా వేడుకలు చేసుకొని ఐసిసి కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించి, భారీ జరిమానాలు, మ్యాచ్ నిషేధాలు ఎదుర్కొన్న ఐదుగురు భారత క్రికెటర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

హర్షిత్ రాణా:

యంగ్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా తన అగ్రెసివ్ సెండ్‌ఆఫ్‌లతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో డెవాల్డ్ బ్రెవిస్ వికెట్ తీసిన తర్వాత అతనికి ఇచ్చిన ఆగ్రహపూరిత సెండ్‌ఆఫ్ కారణంగా ఐసిసి ఒక డీమెరిట్ పాయింట్‌ను కేటాయించింది. అంతకుముందు ఐపిఎల్‌లో మయాంక్ అగర్వాల్‌కు ఫ్లయింగ్ కిస్ సెలబ్రేషన్ ఇచ్చి ఒక మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు.

దిగ్వేష్ రాఠీ:

మిస్టరీ స్పిన్నర్ దిగ్వేష్ రాఠీ తన ప్రముఖ నోట్‌బుక్ సెలబ్రేషన్‌తో తీవ్ర చిక్కులు కొనితెచ్చుకున్నాడు. ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మను అవుట్ చేసిన తర్వాత ఈ రీతిలో ప్రవర్తించి 50 శాతం మ్యాచ్ ఫీజు కోల్పోవడంతో పాటు ఒక మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. అలాగే ఢిల్లీ ప్రిమియర్ లీగ్‌లో ప్రియాన్ష్ ఆర్యను అవుట్ చేసిన సమయంలో కూడా ఇదే సెలబ్రేషన్ పునరావృతం చేసి 30 శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా చెల్లించాడు.

మహమ్మద్ సిరాజ్:

జాతీయ జట్టు కీలక పేసర్ మహమ్మద్ సిరాజ్ మైదానంలో చూపించే తీవ్ర ఆవేశం వల్ల పలుమార్లు క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొన్నాడు. లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్‌ను అవుట్ చేసిన అనంతరం అతని ముఖానికి అత్యంత సమీపంలోకి వెళ్లి ఆవేశంగా వేడుక చేసుకున్నందుకు గాను ఐసిసి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. గతంలో ఆస్ట్రేలియా పర్యటనలో సైతం ఒక డీమెరిట్ పాయింట్ పొందాడు.

ఇషాంత్ శర్మ:

సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ తన కెరీర్‌లో వేడివేడి సెండ్‌ఆఫ్‌ల వల్ల పలుమార్లు ఐసిసి శిక్షలకు గురయ్యాడు. శ్రీలంక పర్యటనలో దినేష్ చండీమాల్, లాహిరు తిరిమాన్నేల వికెట్లు తీసిన సమయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినందుకు ఏకంగా 65 శాతం మ్యాచ్ ఫీజును నష్టపోయాడు. ఇంగ్లాండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో డేవిడ్ మలన్‌ను అవుట్ చేసిన తర్వాత బ్యాటర్ ముఖం ముందే అరిచి జరిమానా తెచ్చుకున్నాడు.

విరాట్ కోహ్లీ & శిఖర్ ధావన్:

మైదానంలో ఎంతో ఆవేశంగా కనిపించే ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్లు మ్యాచ్‌ సమయంలో జరిగిన వాగ్వాదాల వల్ల జరిమానాలు ఎదుర్కొన్నారు. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌తో మైదానంలో అనవసర గొడవకు దిగినందుకు శిఖర్ ధావన్‌కు 30 శాతం జరిమానా పడింది. అదే మ్యాచ్‌లో ఎల్బిడబ్ల్యూ అప్పీల్ తిరస్కరణకు గురైన సమయంలో నాటి ఆక్టింగ్ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ స్టీవ్ స్మిత్‌తో నేరుగా వివాదానికి దిగి, తన మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత పడేలా చేసుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మైదానంలో అగ్రెసివ్ సెలబ్రేషన్స్ చేసి భారీగా ఫైన్ కట్టిన స్టార్స్
మైదానంలో అగ్రెసివ్ సెలబ్రేషన్స్ చేసి భారీగా ఫైన్ కట్టిన స్టార్స్
చీరతో కట్టేసి.. కర్రతో చితక బాదీ.. భర్త హత్య కేసులో ట్విస్ట్!
చీరతో కట్టేసి.. కర్రతో చితక బాదీ.. భర్త హత్య కేసులో ట్విస్ట్!
బంగాళాఖాతంలో వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షసూచన
బంగాళాఖాతంలో వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షసూచన
త్వరలో మార్కెట్లోకి పోకో F9 అల్ట్రా, ప్రో
త్వరలో మార్కెట్లోకి పోకో F9 అల్ట్రా, ప్రో
ఉప్పల్ బాలు వివాదంపై సంచలన వీడియో రిలీజ్ చేసిన నవదీప్
ఉప్పల్ బాలు వివాదంపై సంచలన వీడియో రిలీజ్ చేసిన నవదీప్
అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి రానున్న iQOO Z11.. స్పెషాలిటీస్‌
అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి రానున్న iQOO Z11.. స్పెషాలిటీస్‌
అరెరె ఇన్నాళ్లు లైట్ తీసుకున్నామా.. అల్లం టీ తాగితే కడుపులో..
అరెరె ఇన్నాళ్లు లైట్ తీసుకున్నామా.. అల్లం టీ తాగితే కడుపులో..
UGC NET 2026పరీక్ష రద్దు ఎఫెక్ట్.. NTAలో 50మంది ఉద్యోగుల తొలగింపు
UGC NET 2026పరీక్ష రద్దు ఎఫెక్ట్.. NTAలో 50మంది ఉద్యోగుల తొలగింపు
భారీ బ్యాటరీ, ఐపీ68 రేటింగ్‌తో మార్కెట్లోకి వివో Y31T! వివరాలివే
భారీ బ్యాటరీ, ఐపీ68 రేటింగ్‌తో మార్కెట్లోకి వివో Y31T! వివరాలివే
ఒకే ఇన్నింగ్స్‌లో 451 పరుగులు.. ప్రపంచ రికార్డ్‌నే షేక్ చేశారుగా
ఒకే ఇన్నింగ్స్‌లో 451 పరుగులు.. ప్రపంచ రికార్డ్‌నే షేక్ చేశారుగా