నెమలి ఈక మహిమ నిజమా? పుస్తకంలో పెడితే మార్కులు ఎక్కువస్తాయా?

Samatha

17  August 2026

Gen Z వారు ఎక్కువగా తమ పుస్తకంలో నెమలి ఈకలను పెట్టుకునేవారు. చాలా వరకు ప్రతి పిల్లల పుస్తకంలో ఈ నెమలి ఈకలు అనేవి ఉండేవి.

అయితే చాలా మంది పుస్తకంలో నెమలి ఈకలు పెట్టుకోవడం వలన అదృష్టం కలిసి వస్తుంది. మార్కులు ఎక్కువ వస్తాయి అనేవారు.

మరి నిజంగానే పుస్తకంలో నెమలి ఈక పెడితే మార్కులు ఎక్కువ వస్తాయా? దీని గురించి పండుతులు ఏం చెబుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.

పుస్తకంలో నెమలి ఈక పెట్టడం చాలా శుభప్రదం అని చెబుతున్నారు పండితులు. దీని వలన పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందంట.

నెమలి ఈకలు కృష్ణుడికి, సరస్వతీ మాతకు చాలా ప్రీతికరం అంటారు. అందువలన ఈకలను పుస్తకంలో పెట్టడం చాలా మంచిదంట.

దీని వలన జీవితంలోని అడ్డంకులు తొలిగిపోయి,  చదువులో వెనకబడిన వారు కూడా మళ్లీ చదువులో రాణించే అవకాశం ఉన్నదంట.

పుస్తకంలో నెమలి ఈకను ఉంచడం వలన శ్రీకృష్ణుడి అనుగ్రహం కలగడంవలన అదృష్టం కూడా కలిసి వస్తుందని చెబుతున్నారు పండితులు.

నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.