AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌! భయాందోళనలో ప్రయాణికులు

ఎయిర్ ఇండియా నిర్వహిస్తున్న విస్తృత డ్రగ్ స్క్రీనింగ్‌లో మరో ఇద్దరు పైలట్లు ప్రాథమిక పరీక్షలో విఫలమైనట్లు సమాచారం. తుది నిర్ధారణ కోసం వారి నమూనాలకు మరో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఫలితాలు వచ్చే వరకు ఇద్దరి నీ విమాన విధుల నుంచి తప్పించారు.

డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌! భయాందోళనలో ప్రయాణికులు
Air India Drug Test
SN Pasha
|

Updated on: Aug 17, 2026 | 9:47 PM

Share

ఎయిర్ ఇండియా పైలట్లకు నిర్వహిస్తున్న విస్తృత డ్రగ్ స్క్రీనింగ్‌లో మరో ఇద్దరు పైలట్లు ప్రాథమిక పరీక్షలో విఫలమైనట్లు సమాచారం. అయితే వారు నిషేధిత మత్తు పదార్థాలు తీసుకున్నారా? లేక వైద్యుల సూచనల మేరకు ఉపయోగిస్తున్న మందుల కారణంగా పరీక్షలో ఫలితం వచ్చిందా? అనే విషయాన్ని నిర్ధారించేందుకు ప్రస్తుతం ధృవీకరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తుది ఫలితాలు వచ్చే వరకు ముందుజాగ్రత్త చర్యగా ఇద్దరినీ విమాన విధుల నుంచి తప్పించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

400 మంది పైలట్లకు పరీక్షలు

ఫుకెట్‌-ఢిల్లీ ఎయిర్‌ ఇండియా విమాన కెప్టెన్‌కు నిర్వహించిన నిర్ధారణ పరీక్షలో గంజాయి ఉన్నట్లు తేలిన తర్వాత సంస్థ తన పైలట్లందరికీ విస్తృత స్థాయిలో డ్రగ్‌ స్క్రీనింగ్‌ ప్రారంభించింది. ఇప్పటివరకు సుమారు 400 మంది ఎయిర్‌ ఇండియా పైలట్లకు పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. సాధారణంగా నిబంధనల ప్రకారం ప్రతి ఏడాది విమాన సిబ్బందిలో కనీసం 10 శాతం మందిని యాదృచ్ఛికంగా డ్రగ్‌ పరీక్షలకు ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఎయిర్‌ ఇండియా అంతకంటే విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తోంది.

ప్రాథమిక పరీక్ష.. తుది నిర్ధారణ కీలకం

తాజాగా ఇద్దరు పైలట్లు ప్రాథమిక డ్రగ్‌ స్క్రీనింగ్‌లో విఫలమైనట్లు సమాచారం. అయితే ప్రాథమిక పరీక్ష ఫలితాన్ని మాత్రమే తుది నిర్ధారణగా పరిగణించరు. కొన్ని మందులు లేదా వైద్య చికిత్సలో ఉపయోగించే పదార్థాల వల్ల కూడా కొన్ని స్క్రీనింగ్‌ పరీక్షల్లో అనుమానాస్పద ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే సంబంధిత నమూనాలను మరింత ఖచ్చితమైన నిర్ధారణ పరీక్షలకు పంపినట్లు తెలుస్తోంది. తుది ఫలితాలు వచ్చిన తర్వాతే వారు నిషేధిత పదార్థాలు తీసుకున్నారా లేదా అనేది స్పష్టమవుతుంది.

ఫుకెట్‌-ఢిల్లీ విమానంలో ఏం జరిగింది?

ఈ విస్తృత పరీక్షలకు కారణమైన ప్రధాన ఘటన ఆగస్టు 4న జరిగిన ఫుకెట్‌-ఢిల్లీ AI2379 విమానానికి సంబంధించినది. ఎయిర్‌బస్ A320neo విమానం ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా సుమారు 300 అడుగుల ఎత్తు కోల్పోయింది. ఈ ఘటనలో 24 మంది ప్రయాణికులు, సిబ్బంది గాయపడినట్లు సమాచారం. విమానం చివరకు ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్‌ అయింది. ఘటన అనంతరం ఇద్దరు పైలట్లకు తప్పనిసరి డ్రగ్‌ స్క్రీనింగ్‌ నిర్వహించారు.

పరీక్షలో గంజాయి గుర్తింపు

విమానం ల్యాండ్‌ అయిన తర్వాత నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో కెప్టెన్‌కు అనుమానాస్పద ఫలితం వచ్చినట్లు సమాచారం. అనంతరం నిర్వహించిన నిర్ధారణ ప్రయోగశాల పరీక్షలో గంజాయి ఉన్నట్లు తేలినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో విచారణ పూర్తయ్యే వరకు కెప్టెన్‌, ఫస్ట్‌ ఆఫీసర్‌ను విమాన విధుల నుంచి తప్పించారు. ఇదిలా ఉండగా విమానం ఆకస్మికంగా ఎత్తు కోల్పోవడానికి అసలు కారణంపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఎయిర్‌బస్‌ ప్రాథమిక విశ్లేషణ ప్రకారం విమానంలోని మూడు హైడ్రాలిక్‌ వ్యవస్థల్లో తాత్కాలికంగా ఒత్తిడి తగ్గినట్లు సమాచారం. విమాన నియంత్రణ వ్యవస్థకు సంబంధించిన అంశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

Follow Us
మృత్యువును జయించిన యోధుడు.. బియర్ గ్రిల్స్ రియల్ స్టోరీ
మృత్యువును జయించిన యోధుడు.. బియర్ గ్రిల్స్ రియల్ స్టోరీ
నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కుప్పకూలి ఆరుగురు మృతి
నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కుప్పకూలి ఆరుగురు మృతి
హైదరాబాద్‌‌లో చెడ్డీ గ్యాంగ్.. అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి..
హైదరాబాద్‌‌లో చెడ్డీ గ్యాంగ్.. అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి..
తాయ్ చి వాకింగ్ అంటే ఏమిటి?ఈ ట్రెండ్ తో నిజంగా ఫిట్‌గా ఉంటారా?
తాయ్ చి వాకింగ్ అంటే ఏమిటి?ఈ ట్రెండ్ తో నిజంగా ఫిట్‌గా ఉంటారా?
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు.. పూర్తి షెడ్యూల్
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు.. పూర్తి షెడ్యూల్
ఒక్క కాయ కోసం ఇంత కష్టం! యాలకుల ధర వెనుక దాగిన షాకింగ్ నిజాలు!
ఒక్క కాయ కోసం ఇంత కష్టం! యాలకుల ధర వెనుక దాగిన షాకింగ్ నిజాలు!
హౌస్‌లో ఆమె విష నాగు.. ఈమె షో ఆఫ్..
హౌస్‌లో ఆమె విష నాగు.. ఈమె షో ఆఫ్..
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఇంట్లోనే దొరికే ఈ వస్తువులతో ఈజీగా పాదాల పగుళ్లకు చెక్ పెట్టండి!
ఇంట్లోనే దొరికే ఈ వస్తువులతో ఈజీగా పాదాల పగుళ్లకు చెక్ పెట్టండి!
పరగడుపున లవంగం తింటే ఏమౌతుందో తెలుసా? 7 రోజుల్లో షాక్ అవుతారు!
పరగడుపున లవంగం తింటే ఏమౌతుందో తెలుసా? 7 రోజుల్లో షాక్ అవుతారు!