AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌‌లో చెడ్డీ గ్యాంగ్ కలకలం.. ఫెన్సింగ్‌ కట్‌చేసి అపార్ట్‌మెంట్‌లోకి.. ఆ తర్వాత..

హైదరాబాద్‌ శివార్లలోని మణికొండ నెక్నాంపూర్‌లో చెడ్డీ గ్యాంగ్ చోరీ కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున ఫెన్సింగ్ కట్ చేసి ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన ఆరుగురు అనుమానితులు ఓ ఫ్లాట్‌లో చోరీ చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళను ఆయుధాలతో బెదిరించి.. దాడి చేసినట్లు పేర్కొంటున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్‌‌లో చెడ్డీ గ్యాంగ్ కలకలం.. ఫెన్సింగ్‌ కట్‌చేసి అపార్ట్‌మెంట్‌లోకి.. ఆ తర్వాత..
Hyderabad Chaddi Gang
Shaik Madar Saheb
|

Updated on: Sep 28, 2026 | 7:26 AM

Share

హైదరాబాద్‌ శివార్లలో చెడ్డీగ్యాంగ్‌ కలకలం రేపింది. మణికొండ నెక్నాంపూర్‌లోని ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్‌లో చోరీ చేశారు. చెడ్డీగ్యాంగ్‌ ఫెన్సింగ్‌ను కట్‌చేసి అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించింది.. దుండగులకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.. C-బ్లాక్‌లోని మెట్ల మార్గం ద్వారా ఫ్లాట్‌లోకి చొరబడ్డ దొంగలు.. విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు.. చెడ్డీగ్యాంగ్‌ను గమనించి ప్రశ్నించిన ఒకరిని ఆయుధాలతో దాడి చేసి.. బెదిరించినట్లు పేర్కొంటున్నారు. సమచారం అందుకున్న పోలీసులు.. అపార్ట్‌మెంట్ కు వెళ్లి పరిశీలించి వివరాలను సేకరించారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు..

ఎలా.. ఎప్పుడు ప్రవేశించారంటే..

మణికొండలో చెడ్డీ గ్యాంగ్ ఆదివారం తెల్లవారుజామున సుమారు 3:20 గంటల సమయంలో ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్స్‌లోకి ప్రవేశించింది. లేక్‌సైడ్ వైపు ఉన్న ఫెన్సింగ్‌ను కత్తిరించి అపార్ట్‌మెంట్ ప్రాంగణంలోకి ప్రవేశించిన చెడ్డి గ్యాంగ్ C బ్లాక్‌లోని ఓ ఫ్లాట్‌లో చోరీ చేశారు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళపై ఆయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది . ఆరుగురు వ్యక్తులు అపార్ట్‌మెంట్ ప్రాంగణంలో సంచరిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

వీడియో చూడండి..

అపార్ట్‌మెంట్లకే భద్రత లేకపోతే ఎలా?

సాధారణంగా గేటెడ్ కమ్యూనిటీల్లో సెక్యూరిటీ గార్డులు, గేట్లు, సీసీ కెమెరాలు, వాచ్‌మెన్ వ్యవస్థ ఉంటాయి. అయినప్పటికీ బయట నుంచి ఫెన్సింగ్ కత్తిరించి దుండగులు లోపలికి వస్తే అపార్ట్‌మెంట్ వాసుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా తెల్లవారుజామున ఇలాంటి ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు ఫెన్సింగ్, సీసీ కెమెరాలు, లైటింగ్, సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తతను మరోసారి పరిశీలించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు..

ఇది ఒక్క అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన సమస్యగా కాకుండా నగరంలోని గేటెడ్ కమ్యూనిటీలకు హెచ్చరికగా మారింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
హైదరాబాద్‌‌లో చెడ్డీ గ్యాంగ్.. అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి..
హైదరాబాద్‌‌లో చెడ్డీ గ్యాంగ్.. అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి..
తాయ్ చి వాకింగ్ అంటే ఏమిటి?ఈ ట్రెండ్ తో నిజంగా ఫిట్‌గా ఉంటారా?
తాయ్ చి వాకింగ్ అంటే ఏమిటి?ఈ ట్రెండ్ తో నిజంగా ఫిట్‌గా ఉంటారా?
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు.. పూర్తి షెడ్యూల్
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు.. పూర్తి షెడ్యూల్
ఒక్క కాయ కోసం ఇంత కష్టం! యాలకుల ధర వెనుక దాగిన షాకింగ్ నిజాలు!
ఒక్క కాయ కోసం ఇంత కష్టం! యాలకుల ధర వెనుక దాగిన షాకింగ్ నిజాలు!
హౌస్‌లో ఆమె విష నాగు.. ఈమె షో ఆఫ్..
హౌస్‌లో ఆమె విష నాగు.. ఈమె షో ఆఫ్..
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఇంట్లోనే దొరికే ఈ వస్తువులతో ఈజీగా పాదాల పగుళ్లకు చెక్ పెట్టండి!
ఇంట్లోనే దొరికే ఈ వస్తువులతో ఈజీగా పాదాల పగుళ్లకు చెక్ పెట్టండి!
పరగడుపున లవంగం తింటే ఏమౌతుందో తెలుసా? 7 రోజుల్లో షాక్ అవుతారు!
పరగడుపున లవంగం తింటే ఏమౌతుందో తెలుసా? 7 రోజుల్లో షాక్ అవుతారు!
కోహ్లీ విశ్వరూపం.. ఖాతాలో ఎన్ని రికార్డులు చేరాయో తెలుసా?
కోహ్లీ విశ్వరూపం.. ఖాతాలో ఎన్ని రికార్డులు చేరాయో తెలుసా?
సైన్సా? దైవ రహస్యమా? అద్దంకి వెయ్యి స్తంభాల గుడిలో అద్భుత ఘట్టం
సైన్సా? దైవ రహస్యమా? అద్దంకి వెయ్యి స్తంభాల గుడిలో అద్భుత ఘట్టం