AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bear Grylls: విరిగిన వెన్నుముకతో ఎవరెస్ట్ శిఖరానికి.. వేల అడుగుల పైనుంచి పడి కూడా.. బియర్ గ్రిల్స్ రియల్ స్టోరీ!

Bear Grylls: బియర్ గ్రిల్స్ మదిలో ఒక్కటే ఆలోచన ఉంది. వీల్ చైర్‌లో కూర్చుని చావడం కంటే పోరాడి గెలవడమే నయం. దాదాపు 18 నెలల పాటు నరకం లాంటి నొప్పిని భరిస్తూ, కఠినమైన ఫిజియోథెరపీ, అంతులేని క్రమశిక్షణతో మళ్ళీ నిలబడ్డారు..

Bear Grylls: విరిగిన వెన్నుముకతో ఎవరెస్ట్ శిఖరానికి.. వేల అడుగుల పైనుంచి పడి కూడా.. బియర్ గ్రిల్స్ రియల్ స్టోరీ!
Bear Grylls
Subhash Goud
|

Updated on: Sep 28, 2026 | 8:23 AM

Share

Bear Grylls: ఈ వ్యక్తి మృత్యువును కూడా దాటుకొని ప్రపంచానికి గొప్ప సర్వైవల్ లెజెండ్‌గా మారారు. ఆయనే బియర్ గ్రిల్స్. బ్రిటీష్ ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు, 1996లో ఒక శిక్షణ జంప్ చేస్తున్న సమయంలో ఆయన పారాషూట్ సరిగ్గా తెరుచుకోలేదు. వేల అడుగులపై నుంచి నేరుగా నేలపైకి పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన వెన్నుముక మూడు చోట్ల విరిగిపోయింది. డాక్టర్లు ఈ పరిస్థితిని చూసి, బియర్ బతికి బయటపడటమే ఒక అద్భుతం అని, ఇక జీవితంలో కాళ్ల మీద నడవడం అసాధ్యమని తేల్చి చెప్పారు.

కానీ బియర్ గ్రిల్స్ మదిలో ఒక్కటే ఆలోచన ఉంది. వీల్ చైర్‌లో కూర్చుని చావడం కంటే పోరాడి గెలవడమే నయం. దాదాపు 18 నెలల పాటు నరకం లాంటి నొప్పిని భరిస్తూ, కఠినమైన ఫిజియోథెరపీ, అంతులేని క్రమశిక్షణతో మళ్ళీ నిలబడ్డారు. కేవలం నిలబడటమే కాదు, 1998లో 23 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఆయన అధికారిక సైట్ కూడా 1998 – Summited Everest, age 23” అని పేర్కొంటుంది. మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించారు. ఆయన British Special Forcesలో 21 Special Air Service Regiment (SASR)లో సేవ చేశారు.

ఆ తర్వాత డిస్కవరీ ఛానెల్‌ నుంచి 2006లో Man vs. Wild (మ్యాన్ వర్సెస్ వైల్డ్) ప్రారంభమైంది. ఆయన అధికారిక బయోగ్రఫీలో కూడా 2006ను కార్యక్రమం ప్రారంభమైన సంవత్సరంగా పేర్కొన్నారు. నట్టాడి సముద్రం, మైనస్ డిగ్రీల మంచుకొండలు, మండుటెండలో ఎడారులు.. ఎక్కడ పడేసినా పురుగుల్ని తిని ఒంటరిగా బతికి చూపిస్తూ కోట్లాది మందికి ధైర్యం అంటే ఏంటో నేర్పారు. మన శరీరాన్ని బ్రేక్ చేయొచ్చేమో కానీ, మన లోపల ఉండే పట్టుదలను మాత్రం ఎవరూ బ్రేక్ చేయలేరని బియర్ గ్రిల్స్ నిరూపించారు.

ఇది కూడా చదవండి: SIM: మీ ఆధార్‌పై ఎవరైనా సిమ్ తీసుకున్నారా? కేవలం 5 నిమిషాల్లో కనిపెట్టేయండి..!

ఇది కూడా చదవండి: New Car: కొత్త కారు కొనడానికి బెస్ట్ టైమ్ ఎప్పుడు? ఈ సమయంలో కొంటే మీరు అదృష్టవంతులే..!

Follow Us