పార్లర్‌కు వెళ్లాల్సిన పనిలేదు.. ఇంట్లోనే బొప్పాయితో మెరిసిపోయే అందం!

27 September 2026

TV9 Telugu

TV9 Telugu

ఫేషియల్‌ అంటే చాలామందికి పార్లరే గుర్తొస్తుంది. కానీ ఆ అవసరం లేకుండా ఇంట్లో లభించే పదార్థాలు, పండ్లతోనే స్వయంగా ఫేషియల్‌ చేసుకొని అందంగా మెరిసిపోవచ్చు

TV9 Telugu

ఈ క్రమంలో బొప్పాయితో చేసుకొనే ఈ ఫేషియల్ కూడా అలాంటిదే అంటున్నారు. బాగా పండిన బొప్పాయిపై తొక్క తీసేసి.. ముక్కలుగా కట్‌ చేయాలి

TV9 Telugu

వీటిని మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ గుజ్జును ముఖానికి, మెడకు పట్టించి.. 5 నుంచి 10 నిమిషాల పాటు గుండ్రంగా రుద్దుతూ మర్దన చేసుకోవాలి

TV9 Telugu

తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. కావాలనుకుంటే ఈ బొప్పాయి పేస్ట్‌కు టీస్పూన్‌ చొప్పున కలబంద గుజ్జు, తేనె కలుపుకోవచ్చు

TV9 Telugu

ఇలా బొప్పాయితో చేసుకొనే ఫేషియల్‌ గోల్డెన్ ఫేషియల్ చేసుకున్నంత ఫలితాన్నిస్తుందంటున్నారు నిపుణులు

TV9 Telugu

అంతేకాదు.. ముఖం మీద ఉండే ట్యాన్ కూడా తగ్గుముఖం పడుతుందట! ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేయడం వల్ల ప్రకాశవంతమైన చర్మం సొంతమవుతుందంటున్నారు

TV9 Telugu

బొప్పాయి ఆకులూ ఆయుర్వేద చికిత్సలో ఉపయోగపడతాయి. ప్లేట్‌లెట్లు తగ్గిపోయే డెంగీ వంటి జబ్బులకు బొప్పాయి ఆకులు ఎంతో ఉపయోగపడతాయి

TV9 Telugu

బొప్పాయి ఆకులు చేదుగా ఉంటాయి. ఇప్పుడు బొప్పాయి ఆకు చూర్ణంతో కూడిన క్యాప్సూల్స్‌ మందుల దుకాణాల్లో ప్రస్తుతం వచ్చేశాయి