AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRC దక్షిణ రైల్వేలో ఉద్యోగాలు.. అక్టోబర్ 18 వరకు దరఖాస్తుకు అవకాశం!

దక్షిణ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. RRC, దక్షిణ రైల్వే ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి స్కౌట్స్‌ అండ్ గైడ్స్‌ కోటాలో లెవెల్-1, లెవెల్-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 17 ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 18, 2026లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి..

RRC దక్షిణ రైల్వేలో ఉద్యోగాలు.. అక్టోబర్ 18 వరకు దరఖాస్తుకు అవకాశం!
RRC Southern Railway Recruitment
Srilakshmi C
|

Updated on: Sep 27, 2026 | 7:38 PM

Share

చెన్నైలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC), దక్షిణ రైల్వే పరిధిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2026–27 సంవత్సరానికి దక్షిణ రైల్వే, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లోని లెవెల్-1, లెవెల్-2 పోస్టులను ‘భారత్ స్కౌట్స్ & గైడ్స్’ కోటా కింద భర్తీ చేయనుంది. భారతీయ పౌరులు, ‘భారత్ స్కౌట్స్ & గైడ్స్’లో యాక్టివ్ మెంబర్‌షిప్ ఉన్న అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు అక్టోబర్ 18, 2026 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 17 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. లెవెల్-2 పోస్టులు 3, లెవెల్ 1 పోస్టులు 14 వరకు ఉన్నాయి.

పోస్టును బట్టి గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి/ఐటీఐ లేదా 12వ తరగతి (10+2) ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. అదనంగా ‘భారత్ స్కౌట్స్ & గైడ్స్’కు సంబంధించిన నిర్దేశిత అర్హతలు కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

అర్హత గల అభ్యర్థులు దక్షిణ రైల్వే/ఆర్‌ఆర్‌సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే ముందు విద్యార్హత, వయోపరిమితి, స్కౌట్స్ & గైడ్స్ అర్హతలు, ఇతర నిబంధనలను అధికారిక నోటిఫికేషన్‌లో పూర్తిగా పరిశీలించాలి. అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. స్కౌట్స్ & గైడ్స్‌కు సంబంధించిన అర్హతలు, సర్టిఫికెట్ల పరిశీలన వంటి ప్రక్రియలు కూడా నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు రూ.20,000 నుంచి రూ.25,000 వరకు బేసిక్ పే లభిస్తుంది. దీనికి నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు వర్తిస్తాయి.

ఇవి కూడా చదవండి

ఆర్‌ఆర్‌సీ దక్షిణ రైల్వేలో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us