AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BiggBoss 10: బిగ్ బాస్ హౌస్‌లో ఆమె విష నాగు.. ఈమె షో ఆఫ్..! సరిపోయారు ఇద్దరూ..!!

బిగ్ బాస్ ఇంట్లో ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో కామనర్ గా వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన మిథిలేష్ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఇక అలా పదిహేను లక్షలతో మిథిలేష్ వెళ్లడంపై త్రిగుణ్, ముఖేష్ మాత్రం నానా గొడవ చేశారు. మరికొంతమంది హౌస్ మేట్స్ కూడా రచ్చ రచ్చ చేశారు.

BiggBoss 10: బిగ్ బాస్ హౌస్‌లో ఆమె విష నాగు.. ఈమె షో ఆఫ్..! సరిపోయారు ఇద్దరూ..!!
Biggboss 10
Rajeev Rayala
|

Updated on: Sep 28, 2026 | 7:04 AM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్‌లో ఆదివారం ఎపిసోడ్ అనూహ్య మలుపులతో సాగింది. ఒకవైపు మిథిలేష్ ఎలిమినేషన్‌పై ఇంటి సభ్యుల మధ్య తీవ్ర చర్చ జరగగా.. మరోవైపు చివరి నిమిషంలో ముఖేష్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా వర్షిణి, వంశీని సేవ్ చేయడానికి ముఖేష్ తన కెప్టెన్సీతో పాటు ఇమ్యూనిటీని కూడా వదులుకోవడం ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఆదివారం ఎపిసోడ్‌లో మిథిలేష్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు. అయితే అతడు రూ.15 లక్షలతో బయటకు వెళ్లడంపై త్రిగుణ్, ముఖేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నామినేషన్ ప్రక్రియ ద్వారా ఎలిమినేట్ చేయాల్సిన వ్యక్తిని ఇలా డబ్బులు ఇచ్చి పంపించడం సరైన విధానం కాదంటూ ఇద్దరూ ప్రశ్నించారు. ఈ విషయంలో మొదలైన చర్చ క్రమంగా అమన్ వైపు మళ్లడంతో ఇంట్లో వాతావరణం వేడెక్కింది. అమన్, త్రిగుణ్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. పరిస్థితి అదుపు తప్పుతున్న సమయంలో వంశీ మధ్యలోకి వచ్చి గొడవను ఆపే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో తనను ఎందుకు తోస్తున్నారని వంశీ ఆగ్రహం వ్యక్తం చేయగా.. అమన్ అతడికి క్షమాపణలు చెప్పాడు.

వామ్మో.. ఆమె ఈమే ఒక్కరేనా..? ప్యారడైజ్‌లో కీలక పాత్ర.. ఈ నటిని బయట చూస్తే ఫిదా అవ్వాల్సిందే.!

స్టేజ్‌పైకి వచ్చిన మిథిలేష్ తనకు లభించిన మొత్తాన్ని ఎలా ఉపయోగించబోతున్నాడో కూడా వెల్లడించాడు. తన సాంగ్ షూట్ కోసం ఆ డబ్బును ఖర్చు చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. అదే సమయంలో హౌస్‌లో ఉన్న పలువురు కంటెస్టెంట్లకు కీలక సూచనలు చేశాడు. అమన్, వంశీ, చరణ్, నరేష్, వర్షిణిల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ.. ఎవరి గ్రూపులోనూ పూర్తిగా కలిసిపోకుండా వ్యక్తిగతంగా గేమ్ ఆడాలని సలహా ఇచ్చాడు. మిథిలేష్ ఎలిమినేషన్ తర్వాత ఝాన్సీ సేఫ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. అనంతరం ఇంటి సభ్యులతో ప్రత్యేకమైన గేమ్ ఆడించారు. జంగిల్ థీమ్‌లో భాగంగా వివిధ లక్షణాలతో కూడిన మెడల్స్‌ను కంటెస్టెంట్లకు ఇచ్చి.. ఏ లక్షణం ఎవరికి సరిపోతుందని భావిస్తే ఆ మెడల్‌ను వారి మెడలో వేయాలని సూచించారు.

మహేష్ బాబు, ప్రభాస్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు.. కెరీర్ పీక్‌లో ఉండగానే ఊహించని ట్విస్ట్.. కట్ చేస్తే 31 ఏళ్లకే

ఈ టాస్క్‌లో పలువురిపై ఆసక్తికరమైన కామెంట్లు వచ్చాయి. ముఖేష్.. అమన్‌కు బ్లైండ్ ఫాలోవర్ ట్యాగ్ ఇవ్వగా, రాం ప్రసాద్.. షాలినీకి షో ఆఫ్ అనే ట్యాగ్ ఇచ్చాడు. షాలినీ.. అపూర్వకు విష నాగు ట్యాగ్ వేయగా, నరేష్. దేబ్జానీకి లేజీ అనే మెడల్ ఇచ్చాడు. అపూర్వ త్రిగుణ్‌కు ‘విష నాగు’ ట్యాగ్ ఇవ్వగా.. రోహిత్ కూడా త్రిగుణ్‌ను టార్గెట్ చేస్తూ ‘కన్నింగ్’ మెడల్ ఇచ్చాడు. వంశీ కూడా త్రిగుణ్‌ను ‘అన్నాయింగ్’గా పేర్కొన్నాడు. మరోవైపు ఝాన్సీ.. రోహిత్‌కు ‘లేజీ’ అనే ట్యాగ్ ఇచ్చింది. వర్షిణి సుధీర్.. ముఖేష్‌కు ఫియర్‌లెస్ ట్యాగ్ ఇవ్వగా, చరణ్.. వర్షిణిని బ్లైండ్ ఫాలోవర్ గా పేర్కొన్నాడు. శ్రిష్టి అపూర్వకు, దేబ్జానీ షాలినీకి అన్నాయింగ్ ట్యాగ్స్ ఇచ్చారు. త్రిగుణ్ వంశీకి షో ఆఫ్ మెడల్ ఇవ్వగా.. అమన్ ముఖేష్‌కు కన్నింగ్ అనే ట్యాగ్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ప్రముఖ నటుడు ఫహాద్ ఫాజిల్ తన సినిమా ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ స్టేజ్‌పై సందడి చేశాడు. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఫహాద్ ఫాజిల్‌తో పాటు బేబీ సారా, కార్తికేయ కూడా స్టేజ్‌పైకి వచ్చారు. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌ను ప్రేక్షకులకు చూపించారు.

ఇవి కూడా చదవండి

ఆ హీరో చాలా గొప్పోడు.. స్కూటర్‌ మీద తిరిగే నాకు కారు కొనిచ్చాడు.. అది ఇప్పటికీ నాతోనే ఉంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us