AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: కోళ్ల కోసం వచ్చి కుక్కలకు దొరికిపోయిన చిరుత.. భయంతో ఏం చేసిందో చూడండి..

సాధారణంగా చిరుతపులులను చూసి కుక్కలు భయపడతాయి. కానీ ఇక్కడ మాత్రం పూర్తి రివర్స్‌లో జరిగింది. కుక్కలను చూసి ఓ చిరుత ఏం చేసిందో తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. అవును, ఓ ఇంట్లోకి దూరి కోళ్లను తినేందుకు ప్రయత్నించిన చిరుతను కుక్కలు వెంబడించడంతో, వాటిని చూసి భయపడిపోయిన చిరుత ఏకంగా కొబ్బరి చెట్టెక్కి దాక్కుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

Viral News: కోళ్ల కోసం వచ్చి కుక్కలకు దొరికిపోయిన చిరుత.. భయంతో ఏం చేసిందో చూడండి..
Scared Leopard Climbs Coconut Tree To Escape Street Dogs
Anand T
|

Updated on: Oct 23, 2026 | 4:31 PM

Share

పక్క రాష్ట్రం కర్ణాటకలో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. కుక్కలను చూసి భయపడిన ఓ చిరుతపులి వాటి నుంచి తప్పించుకునేందుకు ఏకంగా కొబ్బరి చెట్టెక్కి దాక్కుంది. వివరాల్లోకి వెళ్తే.. తుమకూరు జిల్లాలోని జ్ఞానేశ్వరి క్యాంపస్‌లో ఉన్న నివాస ప్రాంతంలోకి గురువారం ఉదయం ఒక చిరుతపులి వచ్చింది. ఆహారం కోసం వెతుకుతూ అక్కడే ఉన్న ఓ కోడిని వేటాడేందుకు ప్రయత్నించింది. అయితే చిరుతను గమనించిన అక్కడే ఉన్న కొన్ని కుక్కలు వెంటనే మొరగడం మొదలుపెట్టాయి.

అంతే, వాటి అరుపులు విన్న చిరుత ఒక్కసారిగా భయంతో వణికిపోయింది. ఆ కుక్కల నుంచి తప్పించుకునేందుకు అక్కడి నుంచి పరుగులు తీసింది. ఈ క్రమంలో సమీపంలో ఉన్న ఓ కొబ్బరి చెట్టుపైకి ఎక్కి అక్కడే దాక్కుంది. అయితే చిరుతను తరుముతూ వచ్చిన కుక్కలు కొబ్బరి చెట్టువైపు చూస్తూ మొరుగుతూ ఉన్నాయి. వాటిని గమనించిన స్థానికులు ఏంటా అని దగ్గరికి వచ్చి చెట్టుపైకి చూశారు. అంతే, చెట్టుపై చిరుతపులి కనిపించడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు.

వెంటనే అప్రమత్తమై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ సిబ్బంది చిరుతను పట్టుకోవడానికి రంగంలోకి దిగారు. అయితే అటవీ శాఖ సిబ్బందికి దొరకకుండా తప్పించుకున్న చిరుత, చివరకు అక్కడి నుంచి ఎలాగోలా బయటపడి సమీపంలోని అటవీప్రాంతంలోకి జారుకుంది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలా ఉండగా స్థానికంగా చిరుతపులి సంచరిస్తున్నట్టు తెలియడంతో గ్రామస్తులు, విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు. ఆ చిరుతను ఎలాగైనా పట్టుకొని.. దాని బారి నుంచి తమను రక్షించాలని స్థానిక ప్రజలు అటవీశాఖ అధికారులను కోరుతున్నారు. దీంతో ఆ చిరుతను ఎలాగైనా పట్టుకునేందుకు అధికారులు అది తిరిగే ప్రదేశాన్ని గుర్తించి అక్కడ బోనును ఏర్పాటు చేశారు. అలాగే చిరుత సంచారం పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Follow Us