AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కీలక గ్రహాల అనుకూలత..నవంబర్ నెలాఖరు వరకు వీరికి పట్టిందల్లా బంగారం

November Astrology: కొన్ని రాశులకు నాలుగు గ్రహాలు బాగా అనుకూలంగా మారడం వల్ల మరో నలభై రోజుల పాటు అదృష్టవంతంగా జీవితం కొనసాగుతుంది. కర్కాటకంలో ఉన్న గురు, కుజులు, తులా రాశిలో ఉన్న బుధ, శుక్రులు ఒకరికొకరు చతుర్థ, దశమ కేంద్రాల్లో ఉండడం అనేది యోగదాయకంగా ఉంటుంది. ఈ నాలుగు శుభ గ్రహాలు పరస్పరం కేంద్ర స్థితిలో ఉండడం అత్యుత్తమ రాజయోగాన్ని కలిగిస్తుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఇది నవంబర్ చివరి వరకు కొనసాగుతుంది. ఆదాయ వృద్ధి, అధికారం, సమస్యల పరిష్కారం, ఆరోగ్యం, సంతానం వంటివి కలుగుతాయి. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకరం రాశుల వారికి జీవితం బాగా మారిపోతుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 23, 2026 | 3:56 PM

Share
మేషం: ఈ రాశికి చతుర్థ, సప్తమ కేంద్రాల్లో శుభ గ్రహాలన్నీ సంచారం చేస్తున్నందువల్ల నవంబర్ నెల చివరి వరకు ఈ రాశివారి జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. అనుకున్న పను లన్నీ నిరాటంకంగా పూర్తికావడం, ప్రతి ప్రయత్నమూ నెరవేరడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఆదాయం అనేక రెట్లు పెరిగి, ఆర్థికంగా సంతృప్తికర స్థాయికి చేరుకుంటారు. వృత్తి, ఉద్యో గాల్లో అధికార యోగం పడుతుంది. వ్యాపారాలు బిజీగా సాగుతాయి. పట్టిందల్లా బంగారమవుతుంది.

1 / 6
మిథునం: ఈ రాశికి ధన, పంచమ స్థానాల్లో శుభ గ్రహాలు కేంద్రీకృతం కావడం వల్ల ఒకటికి రెండుసార్లు ధన యోగాలు, రాజయోగాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కలలో కూడా ఊహించని పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. నిరుద్యోగులకు ఆశించిన సంస్థ నుంచిమంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. సంతాన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఆర్థికంగా ఉన్నత స్థితికి ఎదుగుతారు.

2 / 6
కర్కాటకం: ఈ రాశిలో గురు, కుజులు, చతుర్థ స్థానంలో శుక్ర, బుధులు సంచారం చేస్తున్నందువల్ల సాధార ణంగా  ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో సమర్థతకు, ప్రతిభకు మంచి గుర్తింపు లభించి అందలాలు ఎక్కడం జరుగుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వింటారు.

3 / 6
కన్య: ఈ రాశికి ధన స్థానంలో బుధ, శుక్రులు, లాభ స్థానంలో గురు, కుజుల స్థితి వల్ల అనేక విధాలుగా ధన యోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా వృద్ధి చెందుతాయి. కొద్ది ప్రయత్నంతో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలకు దశ తిరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందు తాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి కుదురుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

4 / 6
తుల: ఈ రాశిలో బుధ, శుక్రులు, దశమ స్థానంలో గురు, కుజుల సంచారం ఈ రాశివారికి అనేక విధా లుగా అదృష్టాలను కలిగిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగపరంగా విపరీత రాజయోగం కలుగుతుంది. ఉద్యోగంలో కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగానికి సంబంధించి ఎటు వంటి ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి నిశ్చయం అవుతుంది.

5 / 6
మకరం: సప్తమ కేంద్రంలో గురు, కుజులు, దశమ కేంద్రంలో బుధ, శుక్రుల సంచారం వల్ల ఈ రాశివారికి రెండు మూడుసార్లు ధన యోగాలు కలుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విశేషమైన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులను పొందుతారు. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయ త్నాల్లో ఊహించని విజయాలు లభిస్తాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది.

6 / 6
Follow Us