AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్ బాబు, ప్రభాస్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు.. కెరీర్ పీక్‌లో ఉండగానే ఊహించని ట్విస్ట్.. కట్ చేస్తే 31 ఏళ్లకే

14 సంవత్సరాల వయసులో మోడలింగ్‌రంగంలోకి ప్రవేశించింది ఈ అందాల తార. ఫిలడెల్ఫియాలోని ఓ స్టేజ్‌ షోలో ఈ ముద్దుగుమ్మ డాన్స్ చూసి ముచ్చటపడిన అమితాబ్ బచ్చన్.. ఆమెను హిందీలో యాక్ట్ చేయడానికి ఎంకరేజ్ చేశాడు. అలా ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

మహేష్ బాబు, ప్రభాస్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు.. కెరీర్ పీక్‌లో ఉండగానే ఊహించని ట్విస్ట్.. కట్ చేస్తే 31 ఏళ్లకే
Actress
Rajeev Rayala
|

Updated on: Sep 26, 2026 | 11:20 AM

Share

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసి, అనతికాలంలోనే అగ్రతారగా వెలుగొంద హీరోయిన్ ఆమె. అయితే ఆమె స్టార్ డమ్ కంటే వ్యక్తిగత కారణాలతో ఎక్కువగా వార్తల్లో నిలవడం.. ఆతర్వాత అవకాశాలు లేకుండా పోవడం జరిగింది. దాంతో సినిమాలకు దూరం అయ్యింది. ఆమె మరెవరో కాదు అందాల తార నటి ఆర్తి అగర్వాల్. ఆమె జీవితం ఒక విషాద సినిమా కథ. ఆర్తి అగర్వాల్ 14 ఏళ్ల వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ నటుడు సునీల్ శెట్టి ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె నటనపై ఆసక్తి పెంచుకున్నారు. ముంబైలో నటనలో శిక్షణ పొంది, 2001లో పాగల్పన్ అనే హిందీ చిత్రంతో తెరంగేట్రం చేశారు. ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. అదే సంవత్సరం, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. వెంకటేష్ సరసన కె. విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ ఆమెకు భారీ విజయాన్ని అందించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించి, ఆర్తిని ఓవర్ నైట్ స్టార్‌ను చేసింది.

సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

ఆ తరువాత వరుస సినిమాలతో దూసుకుపోయింది. తరుణ్‌తో నువ్వు లేక నేను లేను, ఎన్టీఆర్‌తో అల్లరి రాముడు, చిరంజీవి ఇంద్ర చిత్రంలో స్నేహలత రెడ్డి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉదయ్ కిరణ్, మహేష్ బాబు, బాలకృష్ణ, రవితేజ, నాగార్జున, ప్రభాస్ వంటి అగ్ర హీరోల సరసన వరుసగా అవకాశాలు దక్కించుకుని టాప్ హీరోయిన్‌గా రాణించారు ఆర్తి అగర్వాల్. అయితే, ఆమె కెరీర్ పీక్ లో ఉండగానే వ్యక్తిగత సమస్యలు చుట్టుముట్టాయి. ఓ ప్రేమ వ్యవహారం మీడియాలో ప్రముఖంగా చర్చకు వచ్చింది. వారి పెళ్లికి హీరో కుటుంబం అంగీకరించకపోవడంతో ఆర్తి తీవ్ర ఒత్తిడికి గురయ్యారని. ఈ మానసిక వేదన కారణంగా ఆమె బరువు పెరిగారని వార్తలు వచ్చాయి. మీడియాలో వచ్చిన అనేక పుకార్లు ఆమెను మరింత కలచివేశాయి. 2005 మార్చి 23న ఆమె యాసిడ్ తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఆ ఘటన నుంచి కోలుకుంటుండగానే, 2006 ఫిబ్రవరి 15న అనుమానాస్పద స్థితిలో మెట్ల మీద నుండి పడిపోయి ఆసుపత్రి పాలయ్యారు.

ఇవి కూడా చదవండి

16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..! అప్పుడు తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి

ఈ సంఘటనల తరువాత ఆమె సినిమాలకు కొద్దికాలం దూరంగా ఉన్నారు. 2007 నవంబర్ 22న న్యూజెర్సీకి చెందిన ఎన్నారై ఉజ్వల్ నికమ్‌ను ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. అయితే, వివాహం తరువాత భర్త నుండి వరకట్న వేధింపులు ఎదురయ్యాయి. తన సినిమాల ద్వారా సంపాదించిన ఆస్తిని ఇవ్వమని బలవంతం చేయడంతో విసిగిపోయిన ఆర్తి విడాకులు తీసుకున్నారు. మళ్ళీ టాలీవుడ్‌లో రీ ఎంట్రీ చేయడానికి ప్రయత్నించి, “అందాల రాముడు, గోరింటాకు, జెంటిల్మెన్ వంటి చిత్రాలలో నటించారు.  సినిమాల్లో అవకాశాలు తగ్గడం, బరువు పెరగడం ఆమెను కలవరపరిచింది. బరువు తగ్గించుకుని మళ్ళీ అవకాశాలను అందిపుచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు.  ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు అంగీకరించి, అందులో ఒక పాత్ర కోసం సన్నబడాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో, 2015 జూన్ 4న ఆమె అమెరికాలోని న్యూజెర్సీలో లైపోసక్షన్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని భావించి ఇంటికి పంపించారు. అయితే, ఆపరేషన్ చేసిన చోట తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఆమెను తిరిగి ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్స్‌లోనే గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. 31 ఏళ్ల వయసులోనే ఆమె జీవితం విషాదాంతం కావడం అందరినీ కలచివేసింది.

స్టార్ హీరోలు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా 460 రోజులు థియేటర్లలో హౌస్‌ఫుల్.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మీ నగరాన్ని నడిపించేది మేయరా? కమిషనరా?
మీ నగరాన్ని నడిపించేది మేయరా? కమిషనరా?
అన్నం వండే ముందు బియ్యాన్ని ఎందుకు కడగాలి?సైన్స్ చెప్తున్న నిజాలు
అన్నం వండే ముందు బియ్యాన్ని ఎందుకు కడగాలి?సైన్స్ చెప్తున్న నిజాలు
కెరీర్ పీక్‌లో ఉండగానే ఊహించని ట్విస్ట్.. కట్ చేస్తే 31 ఏళ్లకే
కెరీర్ పీక్‌లో ఉండగానే ఊహించని ట్విస్ట్.. కట్ చేస్తే 31 ఏళ్లకే
ఆసియా క్రీడల్లో గోల్డ్ గెలిచిన భారత మహిళల కబడ్డీ జట్టు..
ఆసియా క్రీడల్లో గోల్డ్ గెలిచిన భారత మహిళల కబడ్డీ జట్టు..
స్కూళ్ల దగ్గర వాటిని అమ్మితే కఠిన చర్యలు..? కేంద్రం హెచ్చరిక!
స్కూళ్ల దగ్గర వాటిని అమ్మితే కఠిన చర్యలు..? కేంద్రం హెచ్చరిక!
బ్యాంకులు సంచలన నిర్ణయం.. కస్టమర్లకు భారీ ఊరట..ATM ఛార్జీలు రద్దు
బ్యాంకులు సంచలన నిర్ణయం.. కస్టమర్లకు భారీ ఊరట..ATM ఛార్జీలు రద్దు
కస్టమర్లకు బిగ్‌ అలర్ట్.. సెప్టెంబర్ 28 నుంచి బ్యాంకులు బంద్‌..!
కస్టమర్లకు బిగ్‌ అలర్ట్.. సెప్టెంబర్ 28 నుంచి బ్యాంకులు బంద్‌..!
ఇరాన్ శాంతి ప్లాన్‌కు ట్రంప్ నో.. మళ్లీ బాంబుల మోత?
ఇరాన్ శాంతి ప్లాన్‌కు ట్రంప్ నో.. మళ్లీ బాంబుల మోత?
కెప్టెన్ అయిన ముఖేష్.. అపూర్వకు ఇమ్యూనిటీ పవర్
కెప్టెన్ అయిన ముఖేష్.. అపూర్వకు ఇమ్యూనిటీ పవర్
కోసిన యాపిల్ ముక్కలు నల్లగా మారిపోతున్నాయా? రంగు మారకుండా తాజాగా
కోసిన యాపిల్ ముక్కలు నల్లగా మారిపోతున్నాయా? రంగు మారకుండా తాజాగా