AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రమ్మీకల్చర్ మనీలాండరింగ్ కేసులో దూకుడు పెంచిన ఈడీ.. తాజాగా రూ.442 కోట్ల ఆస్తులను జప్తు!

ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం ఉల్లంఘనలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యలు ముమ్మరం చేసింది. రమ్మీకల్చర్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి గేమ్స్‌క్రాఫ్ట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రూ. 442 కోట్ల విలువైన చరాచర ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం రూ.2,843 కోట్ల నేర ఆదాయాలు జప్తు చేసినట్టు తెలుస్తోంది.

రమ్మీకల్చర్ మనీలాండరింగ్ కేసులో దూకుడు పెంచిన ఈడీ.. తాజాగా రూ.442 కోట్ల ఆస్తులను జప్తు!
Rummyculture Money Laundering
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Sep 27, 2026 | 7:33 PM

Share

ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం ఉల్లంఘనలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడును పెంచింది. ఇందులో భాగంగా ప్రముఖ ఆన్‌లైన్ గేమింగ్ యాప్ రమ్మీకల్చర్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి సుమారు రూ. 442 కోట్ల విలువైన చరాచర ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్లు ఈడీ వెల్లడించింది. జప్తు చేసిన ఆస్తులలో భారీగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు, వాణిజ్య దుకాణాలు, ఒక విల్లాతో పాటు అనేక నివాస గృహాలు ఉన్నాయి. ఈ ఆస్తులన్నీ గేమ్స్‌క్రాఫ్ట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న వివిధ వ్యక్తులు సంస్థల పేర్ల మీద ఉన్నట్లు ఏజెన్సీ పేర్కొంది.

ఆస్తుల జప్తుకు ముందు, ఈడీ అధికారులు గేమ్స్‌క్రాఫ్ట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయ ప్రాంగణాలతో పాటు దాని డైరెక్టర్లు, కీలక ఉద్యోగుల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో లభించిన కీలక ఆధారాల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.రమ్మీకల్చర్ మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు జప్తు చేసిన, స్తంభింపజేసిన , స్వాధీనం చేసుకున్న మొత్తం నేర ఆదాయాల విలువ ఏకంగా రూ. 2,843 కోట్లకు చేరుకున్నట్లు ఈడీ తెలిపింది.

ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో గేమ్స్‌క్రాఫ్ట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, రమ్మీటైమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా పలు మొబైల్ అప్లికేషన్ల ద్వారా ఆన్‌లైన్ రియల్ మనీ గేమ్‌లను నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది.రమ్మీకల్చర్ ,రమ్మీప్రైమ్,ప్లేషిప్ , రమ్మీటైమ్ వంటి వివిధ బ్రాండ్‌ల పేరుతో ఆన్‌లైన్ రమ్మీ గేమ్‌లు, టోర్నమెంట్‌లను నిర్వహిస్తూ భారీ ఎత్తున నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు ఏజెన్సీ గుర్తించింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us