AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పుడు బట్టల షాపులో సేల్స్ గర్ల్.. ఇప్పుడు టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్.. కుర్రాళ్ల లేటెస్ట్ క్రష్

ఈ అందాల తార ఎన్నో కష్టాలు దాటి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. చదువుల్లో యావరేజ్ స్టూడెంట్. ఎలాగోలా కష్టపడి డిగ్రీ వరకు చదివింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావడంతో కుటుంబ పోషణ కోసం బట్టల షాపులో సేల్స్ గర్ల్ గా కూడా పనిచేసింది.

Tollywood: ఒకప్పుడు బట్టల షాపులో సేల్స్ గర్ల్.. ఇప్పుడు టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్.. కుర్రాళ్ల లేటెస్ట్ క్రష్
Tollywood Actress
Basha Shek
|

Updated on: Sep 27, 2026 | 6:52 PM

Share

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగొందుతోన్న వారిలో చాలా మంది కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు పడ్డవారే. కుటుంబ పోషణ కోసం చిన్న చితకా పనులు, ఉద్యోగాలు చేసిన వారే. ప్రస్తుతం తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వరుస విజయాలు అందుకుంటోన్న ఈ క్రేజీ హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఈ ముద్దుగుమ్మ అస్సాంలో పుట్టింది. పుణెలో పెరిగింది. చదువులో యావరేజ్ స్టూడెంట్. ఎలాగోలా కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావడంతో చిన్న వయసులోనే కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతలా అంటే పదో తరగతి చదివే వయసులోనే చిన్న చితకా ఉద్యోగాలు చేసింది. ఒకానొక దశలో కాఫీ షాప్‌లో టీలు అందించే పని చేయడంతో పాటు.. బట్టల దుకాణంలో సేల్స్ గర్ల్‌గా కూడా పని చేసింది. అంతేకాదు ఐటీ ఉద్యోగం కూడా చేసింది. కానీ ఎందుకో అక్కడ ఇమడలేకపోయింది. ఇదే క్రమంలో చిన్నప్పటి నుంచి నాటకాలు, స్టేజ్ పెర్ఫార్మెన్స్‌లు, డ్యాన్స్ అంటే ఇష్టంతో పాటు ఆసక్తి ఉండడంతో కళారంగం వైపు అడుగులు వేసింది. కట్ చేస్తే ఇప్పుడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు దూసుకుపోతుంది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరనుకుంటున్నారా? నాని ‘ది ప్యారడైజ్’ సినిమాలో సుబ్బు పాత్రలో క్యూట్ గా కనిపించిన హీరోయిన్ కయాదు లోహర్ దే ఈ స్టోరీ అంతా.

మోడల్ గా కెరీర్ ప్రారంభించింది కయాదు లోహర్. ఈ క్రమంలోనే టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ‘Everyuth Fresh Face Season 12’ టైటిల్‌ను కూడా గెలుచుకుంది. ఈ క్రమంలోనే 2021లో కన్నడ మూవీ ‘ముగిల్‌పేట’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఏడాది 2022లో ‘పతొన్పతామ్ నూట్టాండు’ సినిమాతో మలయాళం ఆడియెన్స్ ను పలకరించింది. అదే ఏడాది అల్లూరి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. అయితే గతేడాది రిలీజైన డ్రాగన్ సినిమా కయదు లోహర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఇందులో ఆమె సెకెండ్ హీరోయిన్ గా నటించినప్పటికీ తన అందం, అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. ఇక ఇటీవల కయాదు నటించిన ఫంకీ సినిమా పెద్దగా ఆడలేదు. అలాగే మలయాళంలో నటించిన ఓ సినిమా కూడా ఫ్లాప్ గా మిగిలింది. అయితే నాని నటించిన ది ప్యారడైజ్ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిందీ అందాల తార. ఇందులో ఆమె పోషించిన సుబ్బు పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇవి కూడా చదవండి

ది ప్యారడైజ్ సినిమాలో కయాదు..

కాగా కయాదు చేతిలో ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. సూర్య హీరోగా, జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కయాదునే హీరోయిన్. అలాగే శివ కార్తికేయన్ 27 సినిమాతో పాటు మారి సెల్వరాజ్ తెరకెక్కిస్తోన్న ‘మంజనాత్తి’ సినిమాలోనూ ఈ బ్యూటీనే కథానాయికగా చేస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఒకప్పుడు షాపులో టీలు అందించింది..ఇప్పుడేమో టాలీవుడ్ హీరోయిన్‌గా..
ఒకప్పుడు షాపులో టీలు అందించింది..ఇప్పుడేమో టాలీవుడ్ హీరోయిన్‌గా..
ఈ తేదీల్లో పుట్టిన వారితో జాగ్రత్త.. ఎక్కువగా గాసిప్ చేస్తారట..!
ఈ తేదీల్లో పుట్టిన వారితో జాగ్రత్త.. ఎక్కువగా గాసిప్ చేస్తారట..!
రూ.20 చెల్లిస్తే చాలు.. రూ.2 లక్షలు అకౌంట్లోకి.. కేంద్రం స్కీమ్..
రూ.20 చెల్లిస్తే చాలు.. రూ.2 లక్షలు అకౌంట్లోకి.. కేంద్రం స్కీమ్..
వైభవ్ సూర్యవంశీ ఔట్.. అఫ్గాన్‌తో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11
వైభవ్ సూర్యవంశీ ఔట్.. అఫ్గాన్‌తో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11
ఇలా చేస్తే టమాటాలు ఎన్ని రోజులైన ఫ్రెష్‌గా ఉంటాయ్..
ఇలా చేస్తే టమాటాలు ఎన్ని రోజులైన ఫ్రెష్‌గా ఉంటాయ్..
గుంటూరు కోడి వేపుడు అంటే.. ఉఫ్ ఉఫ్ అనుకుంటూ తినాల్సిందే!
గుంటూరు కోడి వేపుడు అంటే.. ఉఫ్ ఉఫ్ అనుకుంటూ తినాల్సిందే!
అరెరే కొబ్బరి పీచుతో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా?
అరెరే కొబ్బరి పీచుతో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా?
ఉచ్ఛ స్థితిలోకి చంద్రుడు.. వారి మనసులో కోరికలు నెరవేరడం పక్కా..!
ఉచ్ఛ స్థితిలోకి చంద్రుడు.. వారి మనసులో కోరికలు నెరవేరడం పక్కా..!
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని పూర్తి చేయడం తప్పనిసరి
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని పూర్తి చేయడం తప్పనిసరి
నాన్న నాటిన జ్ఞాపకం.. చెట్టు కోసం ఏకంగా ఇంటి ప్లాన్‌నే మార్చేసిన
నాన్న నాటిన జ్ఞాపకం.. చెట్టు కోసం ఏకంగా ఇంటి ప్లాన్‌నే మార్చేసిన