AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coconut Coir: అరెరే కొబ్బరి పీచుతో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా?.. ఇన్నాళ్లు తెలికా వేస్ట్‌గా పడేశామే!

చాలా మంది ఇంట్లో పూజల సమయాల్లోనే లేదా ఎక్కడికైనా గుడికి వెళ్లినప్పుడూ కొట్టిన టెంకాలయను ఇంటికి తీసుకొస్తారు. అయితే వాటిలోని కొబ్బరి ఒలిచిన తర్వాత ఆ చిప్పలను, కొబ్బరి పీచులను డస్ట్‌బిన్‌లో పడేస్తుంటారు? అయితే ఇకపై ఆ తప్పు చేయకండి. ఎందుకంటే మీరు ఏం పనికిరావనే వాటిని ఇంట్లో అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు.. కాబట్టి కొబ్బరి చిప్పలు, పీచు వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Sep 27, 2026 | 6:34 PM

Share
కొబ్బరి పీచును మీరు దూప్‌స్టిక్‌గా కూడా వాడుకోవచ్చు. ఇందుకోసం మీరు కొబ్బరి పీచును ఎండబెట్టి కత్తెరతో చిన్న ముక్కలుగా కట్‌చేసి.. దీనికి ఎండిన పూలు, కొద్దిగా కర్పూరం, నెయ్యి, లవంగాలు, దాల్చిన చెక్క, గంధం పొడి, కొద్దిగా తేనె తీసుకోవాలి. కర్పూరం, తేనె, నెయ్యి పక్కనబెట్టి మిగతా వాటన్నింటినీ మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత అందులో కర్పూరం, తేనె, నెయ్యి కలిపి ధూప్‌కడ్డీల ఆకారంలో చేసుకోవాలి. వీటిని ఎండబెట్టిన తర్వాత ఇంట్లో వెలిగించుకుంటే మంచి సువాసన వస్తుంది.

1 / 5
హిందూ సాంప్రదాయంలో కొబ్బరికాయలను పవిత్రంగా భావిస్తారు. వాటిని దేవుళ్లను పూజించేందుకు ఉపయోగిస్తారు. అయితే చాలా మంది ఇంట్లో పూజ చేసేందుకు తెచ్చిన కొబ్బరికాయలను కొట్టిన తర్వాత.. వాటిలోని కొబ్బరిని తీసుకొని పీచును తీసి పడేస్తుంటారు. కానీ దానితో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చాలా మందికి తెలియదు. అవును కొబ్బరి పీచును గార్డెనింగ్ నుంచి కిచెన్ క్లీనింగ్ వరకు చాలా రకాలుగా వాడుకోవచ్చు.

2 / 5
కిచెన్ క్లీనింగ్ కోసం: టెంకాయ నుంచి తీసిన కొబ్బరి పీచును మీరు ఇంట్లో పాత్రలు తోమే స్క్రబర్‌గా వాడుకోవచ్చు. కొబ్బరి పీచు కాస్త గరుకుగా ఉంటుంది కాబట్టి.. వంట పాత్రలకు అంటిని మొండి మరకలను సైతం ఈజీగా తొలగిస్తుంది. ఇందుకోసం మీరు కొబ్బరి పీచును ముద్దగా చేసి దానికి ఒక రబర్‌ వేసిన స్క్రబ్బర్‌గా తయారు చేసుకోవచ్చు.. దానిని డిష్‌వాష్ సోప్ సహాయంతో పాత్రలను క్లీన్ చేయవచ్చు. అలాగే కిచెన్ సింక్, కిటెన్ కట్టను కూడా ఈ కొబ్బరి పీచుతో క్లీన్ చేయవచ్చు.

3 / 5
కొబ్బరి పీచుతో మన పెరట్లో ఉన్న మొక్కలకు మల్చింగ్ కూడా చేయవచ్చు. ఇందుకోసం కొబ్బరి పీచును తీసుకొని దాని నారను విడదీసి మొక్కల మొదట్లో మట్టిపై పరచాలి. దీనివల్ల మట్టిలోని తేమ త్వరగా ఆరిపోకుండా మొక్కలు ఎక్కువ రోజులు పచ్చగా ఉండేందుకు తోల్పడుతాయి. అంతేకాదు ఇది మొక్క దగ్గరకు పురుగులు కీటకాలు రాకుండా అడ్డుకుంటుంది. అలాగే ఇది ఎరువుగా కూడా పనిచేస్తుంది.

4 / 5
అంతేకాదు మీరు కొబ్బరి పీచుతో ఇంట్లోనే కోకోపీట్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం కొబ్బరి పీచును చేతులతో విడదీసి కత్తెరతో ముక్కలుగా కట్‌చేయాలి. దాన్ని 3-4 రోజులు నీటిలో నానబెట్టి.. ఆ తర్వాత పూర్తిగా నీరు లేకుండా పిండేయాలి. తర్వాత కాసేపు ఆరబెట్టి మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, మీ గార్డెన్‌లో వాడుకోవడానికి కోకోపీట్ రెడీ అయినట్టే. పైన పేర్కొన్న చిట్కాలు పాలో అయితే.. ఇకపై మీరు కొబ్బరి పీచును వేస్ట్‌గా అస్సలు పడేయరు.

5 / 5
Follow Us