AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారితో జాగ్రత్త.. ఆఫీస్‌లో ఎక్కువగా గాసిప్ చేస్తారట..!

న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా ఏర్పడే మూలాంకానికి వ్యక్తి స్వభావంతో సంబంధం ఉంటుందని నమ్ముతారు. మూలాంకం 2, 3, 4, 7కు చెందినవారు ఇతరులతో ఎక్కువగా మాట్లాడటం, చుట్టుపక్కల విషయాలపై ఆసక్తి చూపడం వంటి లక్షణాలను కలిగి ఉంటారని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా వీరితో ఆఫీసులో వ్యక్తిగత విషయాలు, సహోద్యోగుల రహస్యాలను ఇతరులతో పంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతారు.

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారితో జాగ్రత్త.. ఆఫీస్‌లో ఎక్కువగా గాసిప్ చేస్తారట..!
NumerologyImage Credit source: AI
Janardhan Veluru
|

Updated on: Sep 27, 2026 | 6:47 PM

Share

సంఖ్యా శాస్త్రం ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తుల స్వభావం, ప్రవర్తన గురించి కొన్ని అంచనాలు చెబుతుంటారు. పుట్టిన తేదీ ఆధారంగా మూలాంకను లెక్కించి.. దాని ఆధారంగా వ్యక్తుల స్వభావం, ప్రవర్తనను లెక్కిస్తారు. మూలాంక 2, 3, 4, 7 కలిగినవారు ఇతరులతో ఎక్కువగా మాట్లాడటం, చుట్టుపక్కల విషయాలను తెలుసుకోవడంలో ఆసక్తి చూపుతారని సంఖ్యా శాస్త్రంలో పేర్కొంటారు.

మూలాంక 2 (పుట్టిన తేదీలు: 2, 11, 20, 29)

సంఖ్యాశాస్త్రంలో మూలాంక 2కు చంద్రుడిని అధిపతిగా భావిస్తారు. ఈ తేదీల్లో జన్మించినవారు సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారని, ఇతరుల భావాలను త్వరగా అర్థం చేసుకుంటారని చెబుతారు. దీంతో చాలామంది తమ వ్యక్తిగత విషయాలను వీరితో పంచుకునే అవకాశం ఉంటుంది. అయితే భావోద్వేగానికి లోనై సన్నిహితులు, స్నేహితులు తమకు చెప్పిన విషయాలను ఇతరులతో పంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మూలాంక 3 (పుట్టిన తేదీలు: 3, 12, 21, 30)

మూలాంక 3కు బృహస్పతి అధిపతిగా భావిస్తారు. వీరు సాధారణంగా కలుపుగోలుగా ఉంటారని, ఇతరులతో మాట్లాడేందుకు ఆసక్తి చూపుతారని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. తమలో విషయాలను దాచుకోకుండా బహిరంగంగా మాట్లాడే స్వభావం వీరికి ఉంటుంది. అందుకే కొన్నిసార్లు ఇతరులకు చెప్పకూడని విషయాలు కూడా అనుకోకుండా బయటకు చెప్పే అవకాశం ఉంటుందట.

ఇవి కూడా చదవండి

మూలాంక 4 (పుట్టిన తేదీలు: 4, 13, 22, 31)

సంఖ్యాశాస్త్రం మేరకు మూలాంక 4కు రాహువును అధిపతిగా చెబుతారు. వీరు పరిస్థితులను త్వరగా అర్థం చేసుకునే స్వభావం కలిగి ఉంటారు. చుట్టూ జరుగుతున్న విషయాలను నిశితంగా గమనిస్తారని నమ్మకం. ముఖ్యంగా కార్యాలయంలో ఎవరు ఎవరితో ఏం మాట్లాడుతున్నారు? ఏ అంశంపై చర్చ జరుగుతోంది అనే విషయాలపై ఆసక్తి చూపుతారు.

మూలాంక 7 (పుట్టిన తేదీలు: 7, 16, 25)

మూలాంక 7కు కేతువును అధిపతిగా భావిస్తారు. వీరు బయటకు ప్రశాంతంగా కనిపించినప్పటికీ, అంతర్గతంగా ఎక్కువగా ఆలోచిస్తారని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. తమను తాము ఇబ్బందుల నుంచి కాపాడుకునే క్రమంలో ఇతరుల వ్యక్తిగత లేదా రహస్య విషయాలను పంచుకునే అవకాశం ఉంటుందని చెబుతారు.

గమనిక: పుట్టినతేదీ ఆధారంగా ఇక్కడ పేర్కొన్న లక్షణాలు న్యూమరాలజీ విశ్వాసాల ఆధారమైనవే తప్ప శాస్త్రీయంగా నిరూపితమైన వ్యక్తిత్వ లక్షణాలు కావు. కాబట్టి ఒకరి పుట్టిన తేదీ ఆధారంగా వారి స్వభావానికి సంబంధించి ఖచ్చితమైన నిర్ణయానికి రావడం సరికాదు.

Follow Us