AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వీరికి గోల్డెన్ డేస్..! అదృష్టం పట్టే 3 రాశులివే..

2026 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో జరిగే కీలక గ్రహ సంచారాల ప్రభావంతో కొన్ని వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ జీవితం వంటి అంశాల్లో అనుకూల ఫలితాలు లభించే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ఈ కాలంలో కొత్త అవకాశాలు, ఆదాయ వృద్ధి, శుభ పరిణామాలు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వీరికి గోల్డెన్ డేస్..! అదృష్టం పట్టే 3 రాశులివే..
Lucky Zodiac Signs
Janardhan Veluru
|

Updated on: Sep 21, 2026 | 8:10 PM

Share

2026 సంవత్సరం చివరి మూడు నెలలు (అక్టోబర్ – డిసెంబర్) జ్యోతిష్య పరంగా ప్రత్యేకంగా ఉండనున్నాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో పలు గ్రహాల రాశి, నక్షత్ర మార్పులు చోటుచేసుకోనున్నాయి. అక్టోబర్‌లో గురు గ్రహం సింహ రాశిలోకి ప్రవేశించడంతో పాటు రాహు-కేతువుల కదలికల్లోనూ మార్పులు ఉంటాయి. ఈ గ్రహ సంచారాల ప్రభావం కొన్ని రాశుల వారికి కెరీర్, ఆర్థిక పరిస్థితులు, వ్యాపారం, కుటుంబ జీవితం వంటి అంశాల్లో అనుకూలంగా ఉండొచ్చని జ్యోతిష్యులు అంచనావేస్తున్నారు.

ఈ మూడు నెలల కాలంలో కొందరికి కొత్త ఉద్యోగ అవకాశాలు రావడం, వ్యాపార విస్తరణకు అవకాశాలు లభించడం, ఆగిపోయిన పనులు పూర్తికావడం, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడటం వంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశముంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ మూడు నెలలు శుభ యోగాలు తీసుకొచ్చే అవకాశముంది.

కర్కాటక రాశి

అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో వీరికి అదృష్టం కలిసివచ్చి, చాలాకాలంగా ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగం లేదా వృత్తిలో మార్పు కోరుకునే వారికి అనుకూల అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంది. కొత్త పనిని ప్రారంభించాలనుకునే వారికి కూడా మంచి ఫలితాలు లభించే అవకాశం ఉంది. విదేశాలకు సంబంధించిన పనులు లేదా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలగవచ్చని అంచనా. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. దాంపత్య జీవితంలో ప్రేమ, అనుబంధం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగం లేదా వ్యాపార పనుల కారణంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అయితే ఈ ప్రయాణాలు భవిష్యత్తులో ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ మూడు నెలల్లో గౌరవం, ప్రతిష్ఠ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలోనూ మీ మాటకు, నిర్ణయాలకు ప్రాధాన్యం పెరిగే అవకాశముంది. చాలాకాలంగా కొనుగోలు చేయాలని భావిస్తున్న ఇల్లు లేదా వాహనం విషయంలో ముందడుగు పడే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి డీల్ లభించడం లేదా లాభదాయకమైన అవకాశాలు రావచ్చు. అయితే మార్కెట్‌లో లేదా ఇతర వ్యవహారాల్లో చిక్కుకున్న డబ్బును తిరిగి పొందేందుకు కొంత అదనపు ప్రయత్నం అవసరం కావచ్చు. సరైన వ్యూహంతో, ఓర్పుతో ముందుకు సాగితే సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో ఆర్థికంగా కొంత పురోగతి కనిపించవచ్చని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి.

తుల రాశి

తుల రాశి వారికి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు గతంలో ఎదురైన కొన్ని ఇబ్బందుల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. కెరీర్ లేదా వ్యాపారానికి సంబంధించి దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఈ ప్రయాణాల ద్వారా కొత్త పరిచయాలు, అవకాశాలు ఏర్పడే అవకాశముంది. ఈ సమయంలో మీకు ఇష్టమైన వ్యక్తిని కలిసే అవకాశం కూడా ఉంది. వివాహం గురించి కుటుంబ సభ్యులతో చర్చించే వారికి అనుకూల స్పందన లభించే అవకాశం ఉంది. కెరీర్ విషయంలో సరైన మార్గదర్శకత్వం లభించవచ్చు. వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధాల్లో పరస్పర విశ్వాసం పెరగడంతో పాటు కొన్ని మంచి మార్పులు చోటుచేసుకోవచ్చని అంచనా.

గమనిక: ఈ కథనంలోని అంశాలు జ్యోతిష్య నమ్మకాలు, సంప్రదాయాలపై ఆధారపడినదే. వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితులను బట్టి ఫలితాలు మారవచ్చని గుర్తుంచుకోవాలి

Follow Us