Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. నారాయణమ్మ సాంగ్ చూశారా.. ?
విక్టరీ వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ఆదర్శ కుటుంబం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. అక్టోబర్ 9న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యింది.

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ఈ సినిమాకు ‘హౌస్ నెంబర్ 47’ అనేది ట్యాగ్ లైన్‌గా వ్యవహరిస్తోంది. వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు , అభిమానుల్లో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. అందులో భాగంగా ఈ చిత్రం నుండి మొదటి పాట అయిన ‘నారాయణమ్మ’ సింగిల్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ పాట సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..
రామజోగయ్య శాస్త్రి అందించిన అర్థవంతమైన సాహిత్యం, ప్రభ , రామ్ ఆలపించిన తీరు, అలాగే థమన్ కంపోజ్ చేసిన బాణీలు ఈ పాటను పర్ఫెక్ట్ ఫ్యామిలీ మెలోడీగా నిలబెట్టాయి. ఈ సినిమాలో వెంకటేష్ సరసన కథానాయికగా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. అలాగే నారా రోహిత్, నివేదా పేతురాజ్, పూజిత పొన్నాడ, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చిన్నబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..
అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విజయాన్కి సిద్ధమవుతోంది. ప్రమోషన్ల భాగంగా వచ్చిన ఈ మొదటి పాట సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది.
ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..
నారాయణమ్మ సాంగ్..
ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..
