AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Shani Dev: శని నక్షత్ర మార్పు.. 2027 వరకు వీరికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ పురోగతి

శని నక్షత్ర మార్పు కారణంగా 2027 వరకు కొన్ని రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో పురోగతికి అవకాశాలు ఏర్పడతాయని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కుంభం, మకరం, మిథునం, తుల, ధనుస్సు రాశుల వారికి కొత్త అవకాశాలు, ఆదాయ వృద్ధి, కెరీర్‌లో మార్పులు, వ్యాపార లాభాలు కలిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

Lord Shani Dev: శని నక్షత్ర మార్పు.. 2027 వరకు వీరికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ పురోగతి
Saturn Nakshatra Transit
Janardhan Veluru
|

Updated on: Sep 27, 2026 | 7:11 PM

Share

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహ సంచారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. కేవలం రాశి మార్పే కాకుండా నక్షత్ర మార్పు కూడా కొన్ని రాశులపై తప్పకుండా ప్రభావం చూపుతుందని జ్యోతిష్య నమ్మకం. ప్రస్తుతం మీన రాశిలో వక్రగతిలో ఉన్న శని భగవానుడు.. అక్టోబర్ 9, 2026 నుంచి రేవతి నక్షత్రం నుంచి ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ మార్పుతో కొన్ని రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో పురోగతికి అవకాశాలు ఏర్పడతాయని అంచనా. శని దేవుడి నక్షత్ర మార్పుతో లబ్ధి పొందే రాశులవు ఏవో ఇప్పుడు చూద్దాం..

  1. కుంభ రాశి: ఈ రాశి వారికి ఉద్యోగం, వ్యాపారంలో కొత్త అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంది. తమ ఆలోచనలు, ప్రతిభతో గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు పాత పరిచయాల ద్వారా ప్రయోజనకరమైన అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా లాభాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది.
  2. మకర రాశి: కెరీర్‌లో ముందుకు వెళ్లేందుకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగ్యంలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు, హోదా లభించే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు రూపొందించడానికి అనుకూల సమయంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ప్రముఖులతో పరిచయాలు మేలు చేస్తాయి. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.
  3. మిథున రాశి: ఉద్యోగం, ఆర్థిక వ్యవహారాల్లో కొత్త అవకాశాలు పొందుతారు. అదనపు బాధ్యతలు చేపట్టడంతో పాటు కీలక ప్రాజెక్టులకు నాయకత్వం వహించే అవకాశం ఉంటుంది. ఆదాయం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు కొత్త ప్రాజెక్టులు దక్కే అవకాశముంది. చాలాకాలంగా ఉన్న ఆర్థిక కష్టాలు తీరిపోతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
  4. తుల రాశి: ఉద్యోగంలో మీకు బాధ్యతలు పెరుగుతాయి. అయినా వాటిని సమర్థంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. పై అధికారుల మెప్పు పొందుతారు.  కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. పొదుపు, కొత్త పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. ధనుస్సు రాశి: ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంది. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త ప్రణాళికలు అమలు చేసి లాభాలు పొందే పరిస్థితులు ఏర్పడుతాయి. కఠిన శ్రమకు తగిన ప్రతిఫలాన్ని దక్కించుకుంటారు.

(గమనిక: ఇవి జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా చెప్పే ఫలితాలు మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు)

Follow Us