AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉచ్ఛ స్థితిలోకి చంద్రుడు.. ఈ రాశులకు ఆదాయ వృద్ధి, అధికార యోగం..!

సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 2 వరకు చంద్రుడు వృషభ రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచరిస్తాడు. జ్యోతిష్య ప్రకారం ఈ ప్రభావంతో మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి ఆదాయ వృద్ధి, అధికార యోగం, ఆరోగ్యపరమైన మెరుగుదల, సామాజికంగా గుర్తింపు వంటి శుభ ఫలితాలు కలగవచ్చు. ఈ మూడు రోజులు సుందరకాండ పారాయణం చేయడం వల్ల మనసులోని కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.

ఉచ్ఛ స్థితిలోకి చంద్రుడు.. ఈ రాశులకు ఆదాయ వృద్ధి, అధికార యోగం..!
Moon Exalted In Taurus
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 27, 2026 | 6:24 PM

Share

మనఃకారకుడైన చంద్రుడు ఈ నెల(సెప్టెంబర్) 30, అక్టోబర్ 1, 2 తేదీల్లో వృషభ రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేయడం జరుగుతోంది. చంద్రుడు ఉచ్ఛపట్టే పక్షంలో ఆదాయం వృద్ధి చెందడం, ఆరోగ్యం మెరుగుపడడం, అధికార యోగం పట్టడం, ప్రముఖులతో కలిసి మెలిసి తిరగడం, ఒక ప్రముఖుడిగా గుర్తింపు పొందడం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. ప్రస్తుతం చంద్రుడి ఉచ్ఛ స్థితి వల్ల మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి అధికార యోగం, ఆదాయ వృద్ధి తప్పకుండా కలుగుతాయి. ఈ మూడు రోజులు సుందరకాండ పారాయణం చేయడం వల్ల మనసులోని కోరికలు నెరవేరుతాయి.

మేషం

ఈ రాశివారికి చతుర్థ స్థానాధిపతి అయిన చంద్రుడు ధన స్థానంలో ఉచ్ఛస్థితిలో సంచారం చేయ డం వల్ల ఉద్యోగంలో తప్పకుండా ఉన్నత పదవులు లభిస్తాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభి స్తుంది. తల్లి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. మాతృసౌఖ్యం లభిస్తుంది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. నిరుద్యో గులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. కొన్ని ధన యోగాలు పట్టే అవకాశం ఉంది.

కర్కాటకం

ఈ రాశికి లాభ స్థానంలో రాశ్యధిపతి చంద్రుడు ఉచ్ఛపట్టడం వల్ల పట్టిందల్లా బంగారమవుతుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో తప్పకుండా ఉన్నత పద వులు లభిస్తాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడడంతో పాటు ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభించే అవకాశం ఉంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు లభి స్తాయి.

ఇవి కూడా చదవండి

కన్య

లాభాధిపతి చంద్రుడు భాగ్య స్థానంలో ఉచ్ఛ పట్టడం వల్ల అనేక విధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. పిత్రార్జితం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి.

వృశ్చికం

ఈ రాశికి భాగ్యాధిపతిగా అత్యంత శుభుడైన చంద్రుడు సప్తమ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల రాజ పూజ్యాలు కలుగుతాయి. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సంతాన యోగా నికి అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల లాభాలు కలుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.

మకరం

ఈ రాశికి సప్తమాధిపతి అయిన చంద్రుడు పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేయడం వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కావడం లేదా ప్రేమలో పడడం జరుగుతుంది. వ్యాపార భాగస్వాములతో విభేదాలు తొలగిపోయి, సామరస్యం పెరుగుతుంది. కొత్తగా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. ఆదాయ ప్రయ త్నాలు నూరు శాతం సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా సమసిపోతాయి.

మీనం

ఈ రాశికి పంచమాధిపతి అయిన చంద్రుడు తృతీయ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల పట్టిందల్లా బంగారమవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో మంచి కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయి. తల్లి నుంచి ఆస్తి లాభం కలుగుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

Follow Us