AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాయ్ చి వాకింగ్ అంటే ఏమిటి? ఈ వైరల్ ట్రెండ్ నిజంగా బరువు తగ్గించి, ఫిట్‌గా ఉండటానికి పనిచేస్తుందా?

తై చీ వాకింగ్ అనేది పురాతన మార్షల్ ఆర్ట్స్, మైండ్‌ఫుల్‌నెస్ సూత్రాల ఆధారంగా చేసే అతి నెమ్మదిగా నడిచే ఒక రకమైన వ్యాయామం. హార్వర్డ్ హెల్త్ నివేదిక ప్రకారం, ఈ ప్రక్రియలో ప్రతి అడుగును ఎంతో అప్రమత్తతతో, నియంత్రణతో వేయడం వల్ల శరీర సమతుల్యత, ఎముకల సాంద్రత పెరుగుతాయి. ఇది కాళ్ళు, పాదాల కండరాలను బలోపేతం చేయడంతో పాటు శ్వాసపై ధ్యాస నిలిపి మానసిక ప్రశాంతతను అందిస్తుంది.

తాయ్ చి వాకింగ్ అంటే ఏమిటి? ఈ వైరల్ ట్రెండ్ నిజంగా బరువు తగ్గించి, ఫిట్‌గా ఉండటానికి పనిచేస్తుందా?
Tai Chi Walking
Jyothi Gadda
|

Updated on: Sep 28, 2026 | 7:38 AM

Share

తాయ్ చి వాకింగ్ అంటే ఏమిటి? ఈ వైరల్ ట్రెండ్ నిజంగా బరువు తగ్గించి, ఫిట్‌గా ఉండటానికి పనిచేస్తుందా?

ప్రస్తుతం సోషల్ మీడియాలో తై చీ వాకింగ్ అనే ఫిట్‌నెస్ ట్రెండ్ బాగా వైరల్ అవుతోంది. సాధారణంగా వేగంగా నడిస్తేనే క్యాలరీలు కరిగి బరువు తగ్గుతారని భావిస్తారు. కానీ, అత్యంత నెమ్మదిగా నడుస్తూ కూడా పూర్తి ఫిట్‌నెస్‌ను సాధించవచ్చని తై చీ వాకింగ్ నిరూపిస్తోంది. హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ విడుదల చేసిన నివేదికలో ఈ వాకింగ్ శైలి ప్రాముఖ్యత, ప్రయోజనాల గురించి వివరించారు.

ఏమిటీ తై చీ వాకింగ్?

తై చీ వాకింగ్ అనేది శతాబ్దాల నాటి ప్రాచీన మార్షల్ ఆర్ట్స్ పద్ధతులు, మైండ్‌ఫుల్‌నెస్, నెమ్మదిగా చేసే శరీర కదలికల కలయిక. ఇందులో వేగంగా అడుగులు వేయడం కాకుండా, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచి, ప్రతి అడుగుపై పూర్తి దృష్టి నిలిపి నడుస్తారు. దీనివల్ల శరీరంలోని ప్రాణశక్తి సరిగ్గా ప్రవహిస్తుందని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

కీలక ఆరోగ్య ప్రయోజనాలు:

ఎముకలు, కండరాల బలం: నిదానంగా, నియంత్రణతో అడుగులు వేయడం వల్ల పాదాలు, మడమలు, కాళ్ళ కండరాలు చురుగ్గా మారతాయి. ఇది శరీర బ్యాలెన్స్‌ను పెంచడమే కాకుండా ఎముకల సాంద్రతను పెంచుతుంది.

శ్వాసపై నియంత్రణ: నడుస్తున్నప్పుడు అడుగులపై, శ్వాసపై ధ్యాస పెట్టడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, ప్రశాంతత లభిస్తుంది.

కీళ్ళ నొప్పుల నివారణ: వృద్ధులకు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి ఇది ఎంతో ప్రభావవంతమైన వ్యాయామం.

బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుందా?

హార్వర్డ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, తై చీ వాకింగ్ వల్ల రాత్రికి రాత్రే లేదా వేగంగా బరువు తగ్గిపోరని స్పష్టం చేశారు. అయితే, ఎవిడెన్స్-బేస్డ్ కాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ జర్నల్‌లోని నివేదిక ప్రకారం, ఈ నడకను సరైన నియమాలతో క్రమం తప్పకుండా చేస్తే శరీరంలోని కొవ్వు కరిగి, ముఖ్యంగా నడుము చుట్టుకొలత తగ్గడానికి దోహదపడుతుంది.

తై చీ వాకింగ్ ఎలా చేయాలి?

మొదట కుడి కాలును ముందుకు చాచి నేలపై ఉంచాలి, కానీ దానిపై శరీర బరువును వేయకూడదు (దీనిని ఖాళీ అడుగు అంటారు). ఆ తర్వాత నిమ్మదిగా శరీర బరువు మొత్తాన్ని ముందున్న కుడి కాలుపైకి మార్చాలి. అనంతరం వెనుక ఉన్న ఎడమ కాలును ముందుకు తీసుకువచ్చి, మళ్ళీ అదే విధంగా నెమ్మదిగా అడుగు వేయాలి. అడుగులు వేసేటప్పుడు వెన్నెముక నిటారుగా ఉండాలి.

ఎంత సమయం చేయాలి?

తై చీ ఫర్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం, కొత్తగా నేర్చుకునేవారు రోజుకు 5 నుండి 10 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. కాస్త అలవాటైన తర్వాత 10 నుండి 15 నిమిషాలు, అనుభవం ఉన్నవారు రోజుకు 15 నుండి 30 నిమిషాల వరకు ఈ నడకను కొనసాగించవచ్చు. తీవ్రమైన వ్యాయామాలు చేయలేని వారికి, శారీరక మౌల్డింగ్, మానసిక ప్రశాంతత రెండూ కోరుకునేవారికి తై చీ వాకింగ్ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
హైదరాబాద్‌‌లో చెడ్డీ గ్యాంగ్.. అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి..
హైదరాబాద్‌‌లో చెడ్డీ గ్యాంగ్.. అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి..
తాయ్ చి వాకింగ్ అంటే ఏమిటి?ఈ ట్రెండ్ తో నిజంగా ఫిట్‌గా ఉంటారా?
తాయ్ చి వాకింగ్ అంటే ఏమిటి?ఈ ట్రెండ్ తో నిజంగా ఫిట్‌గా ఉంటారా?
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు.. పూర్తి షెడ్యూల్
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు.. పూర్తి షెడ్యూల్
ఒక్క కాయ కోసం ఇంత కష్టం! యాలకుల ధర వెనుక దాగిన షాకింగ్ నిజాలు!
ఒక్క కాయ కోసం ఇంత కష్టం! యాలకుల ధర వెనుక దాగిన షాకింగ్ నిజాలు!
హౌస్‌లో ఆమె విష నాగు.. ఈమె షో ఆఫ్..
హౌస్‌లో ఆమె విష నాగు.. ఈమె షో ఆఫ్..
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఇంట్లోనే దొరికే ఈ వస్తువులతో ఈజీగా పాదాల పగుళ్లకు చెక్ పెట్టండి!
ఇంట్లోనే దొరికే ఈ వస్తువులతో ఈజీగా పాదాల పగుళ్లకు చెక్ పెట్టండి!
పరగడుపున లవంగం తింటే ఏమౌతుందో తెలుసా? 7 రోజుల్లో షాక్ అవుతారు!
పరగడుపున లవంగం తింటే ఏమౌతుందో తెలుసా? 7 రోజుల్లో షాక్ అవుతారు!
కోహ్లీ విశ్వరూపం.. ఖాతాలో ఎన్ని రికార్డులు చేరాయో తెలుసా?
కోహ్లీ విశ్వరూపం.. ఖాతాలో ఎన్ని రికార్డులు చేరాయో తెలుసా?
బంగారం ధరల్లో ఊహించని మార్పు.. సామాన్యులకు ఊరట..!
బంగారం ధరల్లో ఊహించని మార్పు.. సామాన్యులకు ఊరట..!